Chintamaneni Prabhaker: గోదావరి జిల్లాల్లో వరుసగా జరుగుతున్న ఘటనలు ఆందోళన కల్గిస్తున్నాయి. కోనసీమ జిల్లా పేరు వివాదం, నిరసనలు, అమలాపురం అల్లర్లతో గోదావరి జిల్లాలు వణికిపోయాయి. అమలాపురంలో జరిగిన విధ్వంసం మరవకముందే మరో సంచలన అంశం వెలుగుచూసింది. టీడీపీ సీనియర్ నేత, ప్రభుత్వ మాజీ విప్ చింతమనేని ప్రభాకర్ హత్యకు ప్లాన్ చేశారనే వార్త బయటికి వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ సీనియర్ నేతగా ఉన్నారు చింతమనేని ప్రభాకర్.  దెందులూరు నుంచి ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో అసెంబ్లీ విప్ గా పని చేశారు. తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా చింతమనేనికి పేరు. ఆయన వెరైటీ కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడు వార్తల్లో ఉంటారు. దూకుడు స్వభావంతో ఉండే చింతమనేని ప్రభాకర్.. తన చర్యలతో తరుచూ వివాదాల్లోనూ చిక్కుకుంటూ ఉంటారు. గతంలో ఆయనపై చాలా కేసులు నమోదయ్యాయి. ఎమ్మార్వోపై చింతమనేని దాడి చేసిన ఘటన సంచలనమైంది. అయితే గత ఎన్నికల్లో దెందులూరులో ఓటమి తర్వాత నుంచి చింతమనేనికి కష్టాలు మొదలయ్యాయి.


టీడీపీ పాలన సమయంలో వైసీపీని తీవ్రంగా టార్గెట్ చేశారు చింతమనేని. దీంతో వైసీపీ ప్రభుత్వం రాగానే ఆయన టార్గెట్ అయ్యారు. కేసులు పెట్టి చింతమనేనిని జైలుకు పంపించారు. చింతమనేని సెక్యూరిటీ కూడా తగ్గించింది జగన్ సర్కార్. దీంతో చింతమనేని భద్రత ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు వచ్చాయి. చింతమనేని భద్రత విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా చింతమనేనికి సంబంధించి సంచలన విషయం వెలుగుచూసింది. చింతమనేనిని హత్య చేసేందుకు షూటర్ ను నియమించారనే వార్త కలకలం రేపుతోంది.


తనకు ప్రాణ హాని ఉందంటూ ఇటీవలే ఏలూరు కోర్టులో చింతమనేని ప్రభాకర్ పిటిషన్ వేశారు. తాజాగా శనివారం సాయంత్రం చింతమనేనికి ఓ ఆగంతకుడి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తన హత్యకు షూటర్లని నియమిస్తున్నారంటూ ఫోన్ లో చింతమనేనికి చెప్పాడు ఆ అగంతకుడు. ఈ ఘటనతో దెందూలురులో ఒక్కసారిగా అలజడి నెలకొండి.ఆగంతకుడి ఫోన్ కాల్ పై దర్యాప్తు చేసి, తన భద్రతకు చర్యలు తీసుకోవాలంటూ ఏలూరు 3టౌన్ పోలీస్ స్టేషన్లో చింతమనేని ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. గన్ మెన్ జీతాలకు వ్యక్తిగతంగా డబ్బు చెల్లించే ఆర్ధిక స్థోమత తనకి లేనందున  పోలీసులే ఉచితంగా భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను చంపేందుకు షూటర్ ను నియమించారనే ప్రచారం ఇప్పుడు గోదావరి జిల్లాల్లో సంచలనంగా మారింది. టీడీపీ కేడర్ లో ఆందోళన కల్గిస్తోంది.  


READ ALSO:Covid 19 Cases Updates: దేశంలో మళ్లీ పెరిగిన కోవిడ్ కేసుల సంఖ్య.. కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే... 


READ ALSO: Hyderabad Minor Girl Gang Rape: దుబాయ్ చెక్కేసిన ఎమ్మెల్యే కొడుకు? గ్యాంగ్ రేప్ కేసును నీరుగార్చేపనిలో బడా నేత?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook