అమరావతి: ఏపీ మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీ పార్టీకి షాకిచ్చారు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఏపీ శాసనమండలి ఛైర్మ‌కు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పంపించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ రాజధానిని అమరావతి నుంచి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండనని స్పష్టం చేశారు. తనపై నమ్మకం ఉంచి ఎమ్మెల్యే పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: కాలినడకన అసెంబ్లీకి వెళ్లిన మాజీ సీఎం చంద్రబాబు


‘ఏపీ రాజధాని అమరావతిని మూడు రాజధానులుగా రాష్ట్ర ప్రభుత్వం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాను. ఉమ్మడి ఏపీ విభజన ప్రతిపాదన సమయంలోనూ రాజధాని అమరావతి చేయాలని కోరుతూ అసెంబ్లీలోనూ, బయట ప్రయత్నించారు. టీడీపీలో నన్ను అనేక విధాలుగా ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నా పట్ల చూపిన అభిమానానికి మనస్పూర్తిగా ధన్యవాదాలు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి పోటీ చేసే అవకాశమిచ్చారు. అయితే ఎన్నికల్లో ఓటమిచెందాను.


2019 సాధారణ ఎన్నికల అనుభవాల రీత్యా భవిష్యత్తులో నేను ఎలాంటి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయం తీసుకున్నాను. పై కారణాల రీత్యా, అమరావతి రాజధాని విడిపోతున్నందుకు నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నానని’ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు డొక్కా మాణిక్య వరప్రసాద్ లేఖ రాశారు. అయితే శాసనమండలికి రాజధానుల బిల్లు వచ్చిన రోజే డొక్కా రాజీనామా చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..