Chandrababu letter to Jagan: తాజాగా సీఎం జగన్‌కు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు లేఖాస్త్రం సంధించారు. ఏపీపీఎస్సీ నోటీఫికేషన్ల జారీలో జాప్యం, గ్రూప్‌-1 ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపికలో అవకతవకలను లేఖలో వివరించారు. నిరుద్యోగ యువత కలలు, లక్ష్యాలను సాకారం చేయాల్సిన ఏపీపీఎస్సీ నిర్వీర్యమైయ్యిందన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతి ఏటా జాబ్‌ క్యాలెండర్ ఇస్తామని చెప్పి..మూడేళ్లుగా హామీ అమలు కాలేదని మండిపడ్డారు. గ్రూప్‌-1 ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయడంలో అనుసరిస్తున్న తీరుతో నిరుద్యోగుల్లో గందరగోళం నెలకొందని చెప్పారు. 2018లో 165 గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిందని..2019లో పరీక్షలు జరిగాయని..గతేడాది ఫలితాలు వచ్చాయని లేఖలో గుర్తు చేశారు. 


గ్రూప్‌-1 ఉద్యోగాల విషయంలో అడుగడుగునా అవకతవకలు జరుగుతున్నాయని అభ్యర్థుల నుంచి ఆరోపణలు వస్తున్నాయన్నారు చంద్రబాబు. మెయిన్స్ పరీక్షల తేదీలను ఐదుసార్లు మార్చారని..పరీక్షా పత్రాల మూల్యాంకనంలో తప్పుడు తడకలుగా ఉన్నాయని లేఖలో ఆరోపించారు. కమిషన్‌ కార్యదర్శి, సభ్యులు నిబంధనలు ఉల్లంఘించి..సొంతవారిని ఉద్యోగాలకు ఎంపిక చేస్తున్నారని విమర్శించారు. 


ఏపీపీఎస్సీ నిబంధనల ప్రకారం మొదటి మూల్యాంకనం, రెండో మూల్యాంకనం ఫలితాల్లో 15 శాతం తేడా లేకపోతే..మూడోసారి లెక్కింపునకు అవకాశం లేదని..ఐనా మూల్యాంకనం జరగడం వెనుక అంతర్యం ఏంటని ప్రశ్నించారు. సొంత వారిని అందలం ఎక్కించేందుకే గ్రూప్-1 మెయిన్స్‌లో అక్రమాలు జరిగాయని మండిపడ్డారు. వీటిపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు.


అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలన్నారు చంద్రబాబు. గతంలో గ్రామ సచివాలయ ఉద్యోగాల ఎంపికలో అక్రమాలు జరిగాయని గుర్తు చేశారు. వీటిపై అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని గుర్తు చేశారు. 


Also read:Southwest Monsoon: పోరు గడ్డలోకి నైరుతి రుతు పవనాలు..మూడురోజులపాటు వర్ష సూచన..!


Also read:Revanth Reddy on Modi: మళ్లీ అలా చేస్తే మోదీ పునాదులు కదులుతాయి..రేవంత్ ఘాటు వ్యాఖ్యలు..!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.