Attack on Venkayamma: దళిత మహిళ కుటుంబంపై ఇంత దారుణమా ? : వెంకాయమ్మ కొడుకుపై దాడిని ఖండించిన చంద్రబాబు

Attack on Venkayamma's son: వెంకాయమ్మను పరామర్శించడానికి మాజీ మంత్రి నక్క ఆనంద బాబు తాడికొండ పోలీసు స్టేషన్‌కి వచ్చిన సందర్భంగా స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టిన పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Written by - Pavan | Last Updated : Jun 13, 2022, 12:04 AM IST
  • వెంకాయమ్మపై, ఆమె కొడుకుపై దాడిని తీవ్రంగా ఖండించిన టీడీపీ నేతలు
  • తాడికొండ పోలీసు స్టేషన్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు
  • వైసీపీ సర్కారును ప్రశ్నించినందుకే దాడులు చేస్తున్నారన్న అచ్చెన్నాయుడు
Attack on Venkayamma: దళిత మహిళ కుటుంబంపై ఇంత దారుణమా ? : వెంకాయమ్మ కొడుకుపై దాడిని ఖండించిన చంద్రబాబు

Attack on Venkayamma's son: గుంటూరు: తాడికొండ కంతేరులో తెలుగు దేశం పార్టీ అభిమాని వెంకాయమ్మ, ఆమె కొడుకుపై దాడి నేపథ్యంలో ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న తాడికొండ పోలీసులు.. వైసీపీ, టీడీపీ వర్గాలను స్టేషన్‌కి పిలిపించి విచారిస్తున్నారు. ఇదిలావుండగా.. వెంకాయమ్మకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పోన్ చేసి ఆమెను పరామర్శించారు. వెంకాయమ్మకు పార్టీ అండగా ఉంటుందని, అధికార పార్టీపై పోరాటంలో ధైర్యం కోల్పోవద్దని చంద్రబాబు నాయుడు ఆమెకు ధైర్యం చెప్పారు. 

మరోవైపు వెంకాయమ్మను పరామర్శించడానికి మాజీ మంత్రి నక్క ఆనంద బాబు తాడికొండ పోలీసు స్టేషన్‌కి వచ్చిన సందర్భంగా స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నక్కా ఆనందబాబు తాడికొండ పోలీసు స్టేషన్‌కు వచ్చిన సందర్భంగా కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో మరోసారి టీడీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టిన పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

పోలీసులు అధికార పార్టీకి వత్తాసు : ఆనంద బాబు
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు.. వైసీపీ రౌడీ షీటర్స్ వచ్చి అల్లర్లు చేస్తున్నారని అన్నారు. పోలీస్ స్టేషన్లో వెంకయమ్మపై దాడి జరుగుతున్నా.. పోలీసులు ఏం చేయలేక చేతులెత్తేయడమే కాకుండా అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. పోలీసు స్టేషన్‌లో న్యాయం జరగకపోయినా.. వెంకాయమ్మపై దాడికి పాల్పడిన వారిపై ప్రైవేటు కేసులు పెట్టయినా నిందితులకు శిక్షపడేలా చూస్తామన్నారు. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఏనాడూ చూడలేదని అసహనం వ్యక్తంచేసిన ఆనంద్ బాబు.. ఈ దాడి ఘటనను మానవ హక్కులు, ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం కోసం పోరాటం చేస్తామని తెలిపారు. 

దళిత మహిళ వెంకాయమ్మ కొడుకుపై వైసీపీ అల్లరి మూకలు దాడి చేయడం దారుణమన్న అచ్చెన్నాయుడు.. 
వెంకాయమ్మ కొడుకుపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. వైసీపీ పాలనలో వైఫల్యాలను వేలెత్తి చూపించిన వారిపై, తప్పుల్ని ప్రశ్నించిన వారిపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడడటం వైసీపీ నాయకులు, కార్యకర్తలకు దినచర్యగా మారిందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. దళిత మహిళ వెంకాయమ్మ కొడుకుపై వైసీపీ అల్లరి మూకల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని పేర్కొన్న ఆయన.. వైసీపీ చేతకాని పరిపాలనను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకే వెంకాయమ్మపై, ఆమె కుటుంబంపై వేధింపులకు, భౌతికంగా దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులే వైఎస్సార్సీపీ అనుచరుల నుంచి వెంకాయ‌మ్మ‌ కుటుంబానికి గట్టి భ‌ద్ర‌త క‌ల్పించి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు (Achhennaidu) డిమాండ్ చేశారు.

Also read : Pawan Kalyan Tweet: సంపూర్ణ మద్య నిషేధం అంటే ఆదాయం సంపాదించడమేనా..జగన్‌పై పవన్‌ ఫైర్..!

Also read : Southwest Monsoon: తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతు పవనాల రాకకు వేళాయే..ఇక భారీ వర్షాలే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News