Chandrababu Naidu: డబుల్ ఎంట్రీలను తొలగించండి.. రాష్ట్రంలో ఓట్ల అవకతవకలపై ఈసీకి చంద్రబాబు లేఖ
Chandrababu Naidu Letter to EC: రాష్ట్రంలో ఓట్ల అవకతవకలపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు చంద్రబాబు నాయుడు. డబుల్ ఎంట్రీలను గుర్తించి తొలగించాలన్నారు. ఓటర్ లిస్టులో మరణించిన వారి పేర్లు తొలగించాలని కోరారు.
Chandrababu Naidu Letter to EC: రాష్ట్రంలో ఓట్ల అవకతవకలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రాష్ట్రంలో అధికారపార్టీ ఓట్ల అవకతవకలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఎలక్టోరల్ మాన్యువల్ 2023 ప్రకారం ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు జరగడం లేదన్నారు. మాన్యువల్ ప్రకారం జనాభాపరమైన సారూప్య ఎంపికలు, ఫోటోగ్రాపిక్ సారూప్య ఎంపికలు పరిశీలించి డబుల్ ఎంట్రీలను తొలగించాలని కోరారు. కానీ ఓటర్ల జాబితాలో అనేక నియోజకవర్గాలలో ఇప్పటికీ డబుల్ ఎంట్రీలు గుర్తించబడుతూనే ఉన్నాయన్నారు.
"ఇంటింటి సర్వేలో బాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు గుర్తించిన మరణాల సమాచారం, రాష్ట్ర డేటా బేస్‌లోని బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రార్ సమాచారం మేరకు ఈఆర్ఓలు మరణించిన వారి ఓట్లు తొలగించాలి. కానీ దురదృష్టవశాత్తు డ్రాప్ట్ ఓటర్ లిస్టులో ఇప్పటికీ మరణించిన వారి ఓట్లు దర్శనమిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్–1960 ప్రకారం ఓట్లను ఇంటి నంబర్ల ప్రకారం క్రమంగా ఉండేలా చూడాలి. కానీ నేటికి దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అర్హత లేని వారికి సైతం ఫామ్ –6 ద్వారా ఆన్‌లైన్‌లో ఇష్టానుసారంగా ఓట్లు నమోదు చేస్తున్నారు.
అధికార పార్టీకి అనుకూలంగా ఇష్టానుసారం ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారు. వీటిపై మా అభ్యంతరాలపై నేటికి దృష్టిపెట్టలేదు. డైరెక్ట్‌గా గానీ, ఆన్‌లైన్‌లో గానీ బల్క్ ఫామ్-7 ధరఖాస్తులను స్వీకరించరాదు. ఓటుపై అభ్యంతరం లేవనెత్తి ఓట్లను తొలగించాలని కోరుతున్న వారు ఖచ్చితంగా ఆధారాలు చూపించాలి. కొన్ని నియోజకవర్గాలలో ఎటువంటి విచారణ చేయకుండా తెల్ల పేపర్‌పై పేర్లు రాసిస్తే ఓట్లను తొలగిస్తున్నారు. నేటికి ఈఆర్ఓలు ఓటర్లకు నోటీసులు జారీ చేస్తూ ఓటర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
ఓట్లు మార్పులు చేర్పులకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక రివిజన్ సమ్మరీ సంధర్బంగా చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. డ్రాప్ట్ ఓటర్ లిస్టు ప్రకటించి నెల గడుస్తున్నా పైన పేర్కొన అనేక అభ్యంతరాలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఫైనల్ లిస్తులో ఓట్ల అవకతవకలు మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. దీనికి సంబంధించి ఈఆర్ఓలకు, డీఈఓలకు నిర్ణీత సమయం కల్లా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేయాలి.." అని చంద్రబాబు కోరారు.
Also Read: New Ministers History: తెలంగాణా కొత్త మంత్రుల పూర్తి హిస్టరీ..రాజకీయ అరంగేట్రం వివరాలు..
Also Read: CM Revanth Reddy: కొత్త ప్రభుత్వంలో ప్రక్షాళన.. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్ రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి