Chandrababu Case Updates: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని నిన్న నంద్యాలలో అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు ఇవాళ ఉదయం 6 గంటలకు విజయవాడ సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. చంద్రబాబు పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చుతూ 28 పేజీల రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇవాళ ఉదయం 6 గంటల్నించి సీఐడీ కోర్టులో ఇరుపక్షాల వాదనలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టుకు చెందిన ప్రముఖ న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా వాదనలు విన్పిస్తుంటే..సీఐడీ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి, వివేకాచారి వాదించారు. దాదాపు 4 గంటల్నించి వాదనలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో తన వాదన వినాల్సిందిగా చంద్రబాబు చేసిన విజ్ఞప్తిని సీఐడీ కోర్టు అనుమతించింది. చంద్రబాబు తన వాదన స్వయంగా విన్పించారు. 


కోర్టులో చంద్రబాబు వాదన ఇలా


ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు అనేది కేబినెట్ తీసుకున్న నిర్ణయమని, అసెంబ్లీ కూడా దీనిని ఆమోదించిందని చంద్రబాబు కోర్టుకు తెలిపారు. ఇది ప్రభుత్వ నిర్ణయమైనందున క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీల్లేదని చంద్రబాబు తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు 2015-16లో బడ్జెట్ కూడా కేటాయించామన్నారు. 2021 డిసెంబర్ 9న నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో, రిమాండ్ రిపోర్ట్‌లో తన పేరెక్కడా లేదని చంద్రబాబు వివరించారు. ఈ కేసులో తనను అరెస్టు చేయడం అక్రమమని, తనకెలాంటి సంబంధం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. కేవలం రాజకీయ కక్ష్యతోనే తనను అరెస్టు చేశారని చంద్రబాబు కోర్టుకు విన్నవించారు. గవర్నర్ అనుమతి లేకుండా తనపై కేసు నమోదు చేయం చట్ట విరుద్ధమని చెప్పారు. 


Also read: Siddharth Luthra: చంద్రబాబు కేసు వాదిస్తున్న సిద్ధార్ధ లూథ్రా ఎవరు, ఫీజెంతో తెలుసా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook