Siddharth Luthra: చంద్రబాబు కేసు వాదిస్తున్న సిద్ధార్ధ లూథ్రా ఎవరు, ఫీజెంతో తెలుసా

Siddharth Luthra: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ కోర్టులో వాదోపవాదనలు తీవ్రంగా జరుగుతున్నాయి. రిమాండ్ కోసం సీఐడీ, బెయిల్ కోసం చంద్రబాబు తరపు న్యాయవాదుల మధ్య వాదన కొనసాగుతోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 10, 2023, 09:30 AM IST
Siddharth Luthra: చంద్రబాబు కేసు వాదిస్తున్న సిద్ధార్ధ లూథ్రా ఎవరు, ఫీజెంతో తెలుసా

Siddharth Luthra: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో నిన్న నంద్యాలలో అరెస్టైన చంద్రబాబుని ఇవాళ ఉదయం 6 గంటలకు సీఐడీ కోర్టులో హాజరుపరిచారు సీఐడీ పోలీసులు. ఆ తరువాత చంద్రబాబు పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చుతూ 28 పేజీల రిమాండ్ రిపోర్ట్ దాఖలు చేశారు. మొత్తం దృష్టంగా చంద్రబాబు తరపున వాదిస్తున్న న్యాయవాదిపైనే ఉంది.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్టైన చంద్రబాబుని విడిపించేందుకు తెలుగుదేశం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. చంద్రబాబు కేసును వాదించేందుకు దేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన, ఖరీదైన సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రాను నియమించింది. సిద్ధార్ధ్ లూథ్రా అండ్ టీమ్ నిన్ననే ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు ప్రత్యేక విమానంలో చేరుకుంది.

సిద్ఱార్ధ్ లూథ్రా దేశంలోనే టాప్ న్యాయవాదుల్లో ఒకరు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్నారు. ఢిల్లీ యేతర ప్రాంతాల్లో కేసు వాదించాలంటే ఈయన తీసుకునే ఫీజు రోజుకు అక్షరాలా 1.5 కోట్లు. దాంతోపాటు ప్రయాణానికి ప్రత్యేక విమానం, లగ్జరీ కారు, స్టార్ హోటల్ స్టే కల్పించాల్సి ఉంటుంది. 

తెలుగుదేశం పార్టీకు సిద్ధార్థ్ లూథ్రాతో అనుబంధం చాలాకాలంగా నడుస్తోంది. అమరావతి భూముల కుంభకోణం కేసులో సిద్ధార్ధ లూథ్రానే వాదించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో సునీత తరపున వాదిస్తుంది కూడా సిద్ధార్ధ్ లూథ్రానే. ఇప్పుడీ కేసు టేకప్ చేశారు. దేశంలోనే టాప్ న్యాయవాదిగా ఉన్న సిద్ధార్ధ్ లూథ్రా మరి చంద్రబాబుకు బెయిల్ ఇప్పిస్తారా లేక కేసే కొట్టించేస్తారా లేదా సీఐడీ వాదన ముందు ఓడి రిమాండ్ ఇచ్చేలా చేస్తారా అనేది ఆసక్తిగా మారింది.

Also read: Chandrababu Case Updates: మొత్తం కుట్ర చంద్రబాబు కన్నుసన్నల్లోనే, 28 పీజీల సీఐడీ రిమాండ్ రిపోర్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News