Chandra Babu: స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినా సంగతి తెల్సిందే! గత 52 రోజులుగా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఉన్నారు. చాలా సార్లు బెయిల్ అప్లై చేసినప్పటీకీ కోర్టు ఆ పిటిషన్ ను రద్దు చేసిన సంగతి కూడా తెలిసందే. అయితే ఈ రోజు అనారోగ్య కారణాల  వలన చంద్రబాబు నాయుడుకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జైలుకు నుంచి బయటకు వచ్చిన తరువాత మీడియాతో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు ప్రజలందరికీ మనస్పూర్తిగా నమస్కారాలు, అభినందనలు. నేను కష్టంలో ఉన్నప్పుడు 52రోజులుగా తెలుగు ప్రజలు రోడ్లపైకి వచ్చి సంఘీభావం తెలిపారు, పూజలు చేశారు. ఏపీ లోనే కాకుండా తెలంగాణ, దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు నాపై చూపించిన అభిమానం జీవితంలో ఎప్పుడూ మరువలేను. నేను చేసిన అభివృద్ధి కూడా ప్రజలకు తెలియజెప్పారు. ఫలాలు పొందినవారంతా సంఘీభావం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా లాభం పొందిన వారంతా చూపిన అభిమానంతో నా జీవితం ధన్యమైంది. ఇలాంటి అనుభూతి ఏ నాయకుడికి కూడా రాదని పేర్కొన్నారు. 


45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో నేను ఏ తప్పుచేయలేదు.  తప్పుచేయడానికి అనుమతించలేదు.. ప్రపంచవ్యాప్తంగా నాకు అండగా నిలచిన తెలుగు ప్రజలందరికీ పేరుపేరునా ధన్యావాదాలు. నాకు సహకరించిన, సంఘీభావం తెలిపిన అన్ని రాజకీయ పార్టీలకు నా అభినందనలు. జనసేనపార్టీ బహిరంగంగా వచ్చి నాకు సంఘీభావం తెలిపింది, ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు మనస్పూర్తి అభినందనలు తెలుపుతున్నాను. సంఘీభావం తెలిపిన సిపిఐ, బిజెపి, బిఆర్ఎస్, కాంగ్రెస్ ఇతర పార్టీ ల వారందరికీ అభినందనలు. 52 రోజులుగా నా కోసం తెలుగుప్రజలు అధైర్యపడకుండా పోరాడారు. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు నా కోసం సైకిల్ యాత్ర చేశారు, వారందరినీ అభినందిస్తున్నా.


Also Read: iPhone Tapping: దేశంలో ఫోన్ ట్యాపింగ్ దుమారం, ఫోన్లు హ్యాక్ అవుతున్నాయంటూ అలర్ట్


హైదరాబాద్ లో ఐటి ప్రొఫెషనల్స్ సైబర్ టవర్స్ నిర్మించి 25సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పెద్దఎత్తున నాకు కనీవినీ ఎరుగని రీతిలో సంఘీభావం తెలియజేయడం జీవితంలో మరువలేను. 45సంవత్సరాల ప్రజాజీవితంలో నేను చేసిన పనులను నెమరువేసుకున్నారు, అందరినీ పేరు పేరునా అభినందిస్తున్నాను. మీడియా కూడా పెద్దఎత్తున సహకరించారు, వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అని చంద్రబాబు తెలిపారు. 


Also Read: 6 Kg Semi Automatic Washing Machine: ఫ్లిఫ్‌కార్ట్‌లో 6 కేజీ MarQ by Flipkart వాషింగ్‌ మెషిన్‌ను రూ.990కే పొందండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..