TTD: తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఇప్పటి వరకూ రాలేదు. భవిష్యత్‌లో వస్తుందో లేదో తెలియదు. టీటీడీ చరిత్రలో ఇదొక అరుదైన ఘటన. అదేంటో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధ్యాత్మిక ప్రాంతం తిరుమలకు సంబంధించి ఓ ప్రత్యేక, అరుదైన ఘటన జరగనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam)ఇందుకు వేదిక కానుంది. టీటీడీ చరిత్రలో అరుదైన ఓ దృశ్యం ఇవాళ ఆవిష్కృతం కానుంది. తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలో ఇంతటి అరుదైన దృశ్యం ఇప్పటివరకూ జరగలేదు. భవిష్యత్‌లో జరుగుతుందో లేదో తెలియని పరిస్థితి. ఒకే కుటుంబంలో ముఖ్యమంత్రులైన తండ్రీకొడుకులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం కలగడమే ఆ అరుదైన దృశ్యం. 1953లో తిరుమల తిరుపతి దేవస్థానం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో వచ్చాక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాల్ని సమర్పించే సంప్రదాయం మొదలైంది. ప్రారంభంలో దేవాదాయశాఖ అధికారులు, ఆ తరువాత దేవాదాయశాఖ మంత్రులు పట్టువస్త్రాల్ని సమర్పించేవారు. ఎన్టీఆర్ హయాం నుంచి ముఖ్యమంత్రి స్వయంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయం మొదలైంది.ఈ క్రమంలో 2004 నుంచి 2009 వరకూ ఐదుసార్లు ముఖ్యమంత్రిగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి(Ys Rajasekhar reddy) శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఇప్పుడు ఆయన కుమారుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan) శ్రీవారికి వరుసగా మూడోసారి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు శ్రీవారికి పట్టువస్త్రాలు(Srivari Pattu Vastralu)సమర్పించడం అది కూడా తండ్రీకొడుకులు కావడం ఇదే ప్రధమం. 


Also read: Dussehra Special Trains: దసరా వేళ ప్రయాణీకుల రద్దీ, ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రత్యేక రైళ్లు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook