Ustaad Bhagat Singh Dialogue: పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాత్ భగత్ సింగ్ సినిమా ఎన్నికళ వేళ వివాదం రేపుతోంది. సినిమా షూటింగ్ ముందుకు సాగడం లేదు గానీ అందులో ఓ డైలాగ్ మాత్రం ఇప్పుడు రచ్చ చేస్తోంది. అసలీ డైలాగ్ ఏంటి, ఎన్నికల కమీషన్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనే వివరాలు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జనసేనాని పపన్ కళ్యాణ్ జనసేన రాజకీయ పార్టీ నడుపుతూనే మద్యమద్యలో సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే హరీష్ శంకర్ దర్శకత్వంతో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా కొద్దిరోజులే షూటింగ్ జరుపుకుంది. ప్రస్తుతం ఎన్నికల వేళ కావడంతో సినిమాకు లాంగ్ బ్రేక్ వచ్చింది. తిరిగి ఎన్నికల తరువాత సినిమా షూటింగ్ ఉంటుంది. ఈ నేపధ్యంలో ఈ సినిమాలోని చిన్న టీజర్‌ను విడుదల చేశారు. ఎన్నికల వేళ కావడంతో ఈ టీజర్ బాగా వైరల్ అవుతోంది. అందర్నీ ఆకట్టుకుంటోంది. 


ఈ టీజర్‌లో పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్స్ అందర్నీ ఆకర్షిస్తున్నాయి. గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం..గాజు పగిలేకొద్దీ పదునెక్కుద్ది.  జనసేన ఎన్నికల గుర్తు కూడా గాజు గ్లాసు కావడంతో ఈ డైలాగ్ వివాదం రేపుతోంది. ఎన్నికల వేళ కావాలనే ఈ డైలాగ్ విడుదల చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో జనసేన పార్టీ ప్రచారానికి అనువుగా ఉన్న డైలాగ్ కావడంతో విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఈ డైలాగ్ తొలగించాలని, టీజర్ తీసివేయాలని ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదులు కూడా అందాయి.


ఈ విషయంపై ఏపీ ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా స్పందించారు. ఆ టీజర్ తాను ఇంకా చూడలేదని, చూసిన తరువాత ఆ టీజర్‌పై చర్యలు తీసుకుంటానన్నారు. టీజర్‌లో రాజకీయ ప్రచారాంశంతో డైలాగ్స్, సీన్స్ ఉంటే సినిమా యూనిట్ ఎన్నికల సంఘానికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. దాని ప్రకారం టీజర్ తొలగించే విషయమై ఎన్నికల అధికారి నిర్ణయం తీసుకోనున్నారు. 


Also read:AP DSC 2024: ఏపీ డీఎస్సీ నిలిపివేతకు హైకోర్టు నో, ఇప్పుడిక నిర్ణయం ఈసీ చేతిలోనే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook