అమరావతి: ఏపీలో గత 24 గంటల్లో 63,686 శాంపిల్స్‌ని ( COVID-19 tests ) పరీక్షించగా.. అందులో 10,328 మందికి  కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. అదే సమయంలో  కరోనావైరస్ ( Coronavirus ) కారణంగా రాష్ట్రంలో 72 మంది చనిపోయారు. జిల్లాల వారీగా మృతుల సంఖ్య విషయానికొస్తే.. అనంతపురంలో 10 మంది, తూర్పు గోదావరిలో 10 మంది, గుంటూరు జిల్లాలో 9 మంది, చిత్తూరు జిల్లాలో 8 మంది, కృష్ణా జిల్లాలో ఆరుగురు, నెల్లూరు జిల్లాలో ఆరుగురు, ప్రకాశం జిల్లాలో ఆరుగురు, విశాఖపట్నం జిల్లాలో నలుగురు, కడప జిల్లాలో ముగ్గురు, విజయనగరం జిల్లాలో ముగ్గురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ఇద్దరు, శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. Also read: Plasma therapy: ప్లాస్మాతో ప్రయోజనం లేదా ? ఢిల్లీ ఎయిమ్స్ సంచలన ప్రకటన


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ( Health bulletin ) ప్రకారం.. గత 24 గంటల్లో 8,516 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 22,99,332 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తం 1,96,789 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఏపీలో కరోనా సోకిన వారిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 2461 మంది కాగా ఇతర దేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య 434 గా ఉంది. Also read: Health tips: ఉప్పు ఎక్కువ తింటున్నారా ? ఐతే ఈ ప్రాబ్లమ్స్ తప్పవు



కరోనావైరస్ బారిన పడిన జిల్లాల్లో అత్యధికంగా 23,348 కరోనా పాజిటివ్ కేసులతో కర్నూలు ముందుండగా అత్యల్పంగా  ప్రకాశం జిల్లాలో 7256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో గత 24 గంటల్లో 1,285 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కరోనా మరణాలు నమోదైంది కూడా ఇదే జిల్లాలో కావడంతో ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కరోనా పేరెత్తితేనే జిల్లా వాసులు హడలిపోతున్నారు. ఇప్పటివరకు కరోనా కారణంగా ఈ జిల్లాలో 223 మంది చనిపోయారు. Also read: మీకూ ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తున్నాయా ? ఐతే జాగ్రత్త !