TDP Leaders Sharing Fake Video: ఏపీలో రోడ్ షోలు, సభలు నిషేధించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. బుధవారం చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనను పోలీసులు అడ్డుకోవడంతో.. ప్రచార రథాలను కూడా నిలిపివేశారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కుప్పంలో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాటలు జరగ్గా పలువురు గాయపడ్డారు. రోడ్‌ షోలకు అనుమతి లేదంటూ చంద్రబాబును పోలీసులు నిలిపివేయడంతో దాదాపు ఆయన గంటపాటు రోడ్డుపైనే ఉన్నారు. దీంతో మైక్ పట్టుకుని అక్కడే ప్రసంగించారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సభకు భారీగా జనం తరలివచ్చారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు సోషల్ మీడియాలో ఓ వీడియోను పంచుకుంటున్నారు. ఆ వీడియోలో భారీగా ప్రజలు రోడ్లపై ఉన్నారు. 'అరచేతితో సూర్యున్ని ఆపాలని అనుకోవటం ఎంత అవివేకమో.. జీఓలు తెచ్చి ప్రజనాయకున్ని ఆపాలని అనుకోవటం అంతకంటే అవివేకమే అవుతుంది. కుప్పంలో చంద్రబాబు సభకు వచ్చిన ప్రజలను చూడండి' అంటూ వీడియో పోస్ట్ చేశారు.


ఈ వీడియోపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. 'కుప్పంలో చంద్రబాబుకి వచ్చిన జనం అంటూ సోషల్ మీడీయాలో ప్రచారంలో ఉన్న వీడియో కర్ణాటక విజయపుర సిద్దేశ్వర స్వామీజీ యాత్ర.. చంద్రబాబు పర్యటనకి జనం కరువయ్యే సరికి ఇలా ప్రచారం చేసుకుంటున్నారు..' అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. 'కర్ణాటకలో జరిగిన ఒక భక్తి కార్యక్రమాన్ని మీరు ఇలా వాడుకుంటున్నారు చూడు.. ఇక్కడే టీడీపీ సచిపోయింది..' అని కామెంట్స్ చేస్తున్నారు. తమ సభలకు భారీగా జనాలు వచ్చారని కవరింగ్ ఇచ్చుకునేందుకు ప్రయత్నించి టీడీపీ అడ్డంగా బుక్కయిందంటున్నారు. 


కుప్పంలో చంద్రబాబు నాయుడిని అడ్డుకోవడంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా స్పందించిన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన చేయకుండా అడ్డుకోవడంపై ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నానని అన్నారు. ప్రతిపక్ష పార్టీల గొంతు వినిపించకూడదు.. ఆ పార్టీలు కార్యక్రమాలు నిర్వహించకూడదనే ఉద్దేశంతోనే జీవో 1ని తీసుకువచ్చారని విమర్శించారు. ఇటువంటి జీవో గతంలో ఉండి ఉంటే జగన్‌ రెడ్డి నాడు ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేయగలిగేవారా..? అని ప్రశ్నించారు. 


Also Read: Fastest Ball By Indian Bowler: టీమిండియా తరుఫున అత్యంత వేగవంతమైన టాప్-5 బౌలర్ల వీళ్లే..   


Also Read: Shock to Balakrishna: నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవిలకి ఏపీ సర్కార్ షాక్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook