Political Speech: తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్లు భక్తి విషయాలు కాకుండా ఇతర విషయాలు మాట్లాడుతుండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులను తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం చేస్తున్న వ్యాఖ్యలు వివాదస్పదమవుతుండడంతో టీటీడీ దిద్దుబాటు చర్యలు తీసుకుంది. ఇకపై తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు.. ప్రసంగాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ సందర్భంగా తిరుమల కొండపై రాజకీయ ప్రసంగాలపై టీటీడీ నిషేధం విధించింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇది చదవండి: Tirumala Photoshoot: తిరుమలలో మరో వివాదం.. ప్రధానాలయం ముందు రాజకీయ నాయకుల హల్‌చల్‌


తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు తిరుమలలో రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. నిత్యం గోవింద నామాలతో మారుమోగే పవిత్రమైన తిరుమల దివ్య క్షేత్రంలో కొంతకాలంగా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన రాజకీయ నాయకులు కొంతమంది దర్శనానంతరం ఆలయం ముందు రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు. మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ప్రసంగాలు.. విమర్శలు చేయడం పరిపాటిగా మారడంతో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలుగుతోందని టీటీడీ గుర్తించింది.


ఇది చదవండి: Red Sandalwood: 'పుష్ప'ను మించి ఎర్రచందనం స్మగ్లింగ్‌.. శేషాచలంలో 12 మంది కూలీలు అరెస్ట్‌


ఈ నేపథ్యంలో రాజకీయ ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ బోర్డు ఇటీవల తీర్మానించింది. ఇకపై తిరుమలకు విచ్చేసిన రాజకీయ నాయకులు రాజకీయ విమర్శలు.. ప్రసంగాలు చేయొద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతీసే ప్రసంగాలకు దూరంగా ఉండాలని టీటీడీ ఆదేశించింది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు హెచ్చరిస్తున్నారు. తిరుమలను రాజకీయంగా కాకుండా భక్తి.. ఆధ్యాత్మికంగా చూడాలని టీటీడీ హితవు పలుకుతోంది.
త్వరలో వారిపై కూడా?
ఇటీవల తిరుమల వేదికగా రాజకీయాలు జరిగిన విషయం తెలిసిందే. తిరుమలకు విచ్చేసిన సమయంలో టీటీడీ, వైఎస్సార్‌సీపీతోపాటు ఇతర రాజకీయ నాయకులు రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. టీటీడీ తాజా నిర్ణయంతో తిరుమల కొండ రాజకీయాలకు దూరం కానుండడం హర్షించే విషయం. ఇక సోషల్‌ మీడియా కూడా ఇబ్బందిగా మారడంతో ఫొటోగ్రాఫర్లు, రీల్స్‌.. ప్రాంక్‌లు చేసే వారిపై కూడా టీటీడీ కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.