TTD rules post lockdown: లాక్‌డౌన్ తర్వాత టిటిడి భక్తులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు
TTD darshanam rules: తిరుమల: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ చేపట్టడంతో తిరుమలలో భక్తులకు శ్రీవారి దర్శనం ( Lord Balaji) కూడా నిలిపేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా జూన్ 8వ తేదీ నుంచి ప్రార్థనా మందిరాల్లో భక్తులకు ప్రవేశం కల్పిస్తూ కేంద్రం సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో తిరుమలలో వెంకన్న భక్తులకు శ్రీవారి దర్శనం కోసం ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.
TTD darshanam timings, rules: తిరుమల: కరోనావైరస్ వ్యాప్తిని నివారించేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులోకి వచ్చిన అనంతరం తిరుమలలో భక్తులకు శ్రీవారి దర్శనం ( Lord Balaji) నిలిపేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా జూన్ 8వ తేదీ నుంచి ప్రార్థనా మందిరాల్లో భక్తులకు ప్రవేశం కల్పిస్తూ కేంద్రం సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో తిరుమలలో వెంకన్న భక్తులకు శ్రీవారి దర్శనం కోసం ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. అందులో భాగంగానే తొలుత జూన్ 8, 9 తేదీల్లో టిటిడి ఉద్యోగులతో ట్రయల్ రన్ నిర్వహిస్తామని టిటిడి చైర్మన్ వైవి సుబ్బా రెడ్డి తెలిపారు. దర్శనంలో భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులను పరిశీలించి మరిన్ని చర్యలు తీసుకోనున్నట్టు చెప్పిన ఆయన.. ఆ తర్వాత స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులు కచ్చితంగా మాస్క్ ధరించాలని.. క్యూలైన్లలో కనీసం ఆరడుగుల భౌతిక దూరం పాటించాలని స్పష్టంచేశారు. ( TTD lands issue : టిటిడి ఆస్తుల వేలం వివాదంపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం )
కరోనావైరస్ నివారణకు విధించిన నిబంధనలు పాటిస్తూ రోజుకి ఎంతమందికి దర్శనాలు చేయించవచ్చు అనేదానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పిన చైర్మన్ వైవి సుబ్బారెడ్డి.. 11వ తేదీ నుంచి సామాన్య భక్తులకు కూడా దర్శనాలకి అనుమతిస్తామని అన్నారు. ప్రతీ రోజూ ఆన్‌లైన్ ద్వారా దర్శనానికి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాథమిక దశలో రోజూ మూడు వేల మందికి అన్‌లైన్ ద్వారా దర్శనం కోసం టికెట్స్ బుక్ చేసుకునేందుకు వీలు కల్పిస్తామని ఆయన తెలిపారు.
హుండీని భక్తులు తాకడానికి వీలులేకుండా భక్తులు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా భక్తులకు టిటిడి విజ్ఞప్తి చేసింది. లేదంటే ఒకరు తాకిన చోట మరొకరు తాకడం వల్ల భక్తుల్లో ఎవరికైనా ఇన్‌ఫెక్షన్ ఉంటే అది ఇతరులకు కూడా సోకే ప్రమాదం ఉంటుందని టిటిడి ఆందోళన వ్యక్తంచేసింది. అయితే, అదే సమయంలో హుండీని తాకకూడదని కూడా భక్తులని అదేశించలేమని.. ఎందుకంటే ఇది వారి మనోభావాలకు సంబంధించిన అంశమని టిటిడి అభిప్రాయపడింది. ( TTD lands issue : టీటీడీ వివాదంపై పాత ఆధారాలు బయటపెట్టిన బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి )
కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో తిరుమలకు వచ్చే భక్తులు ఎవ్వరూ కోవిడ్-19 బారిన పడకుండా ప్రతి ఒక్క భక్తుడు జాగ్రత్తలు తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేసింది.
లాక్‌డౌన్ అనంతరం ఎప్పటిలాగే శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులు అక్కడికొచ్చాకా ఇబ్బందులు పడకూడదంటే వారు ముందుగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
65 ఏళ్ళు పైబడిన వృద్ధులు, పదేళ్ల లోపు పిల్లల్ని కొండపైకి అనుమతించరు.
దేశ వ్యాప్తంగా కంటైన్మెంట్ జోన్లు, రెడ్ జోన్ల పరిధిలో ఉన్నవారు అక్కడి నుంచి స్వామి వారి దర్శనం కోసం తిరుమలకు రావొద్దు.
అలాంటి ప్రాంతాల నుంచి ఒకవేళ ఆన్‌లైన్లో టికెట్ బుక్ చేసుకుని తిరుపతికి వచ్చినా.. అలిపిరి గేటు దగ్గరే వారిని నిలిపివేస్తారు.
ఉదయం 6.30 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు మాత్రమే దర్శనాలకి అనుమతి.
ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకోలేనివారు అలిపిరి గేటు దగ్గర బుకింగ్ కౌంటర్ దగ్గర ఆఫ్‌లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు.
11వ తేదీ నుంచి ఉదయం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు ఒక గంట పాటు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతి.
భద్రతా కారణాలరీత్యా శ్రీవారి నడక మార్గంలో భక్తులకు అనుమతి లేదు.
అలిపిరి గేటు వద్ద రిజిస్ట్రేషన్ కౌంటర్‌లో ధర్మల్ స్క్రీనింగ్ జరుగుతుంది.
వాహనాలకు పూర్తి స్థాయిలో శానిటైజ్ చేసాకే కొండపైకి అనుమతి.
సోషల్ డిస్టెన్సింగ్ లక్ష్యం దెబ్బ తినకుండా కరోనా నివారణ కోసం ఉచిత అన్నదాన సత్రంలోకి అతి తక్కువ మందిని లోపలికి అనుమతించనున్నట్టు టిటిడి ప్రకటించింది.
ర్యాండం పద్ధతిలో భక్తుల శాంపిల్స్ తీసుకుని పరీక్షించేందుకు అలిపిరిలోనూ, కొండపైన ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నాం.
కల్యాణ కట్టలో భక్తులకు తలనీలాలు తీసే అంశంపై త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటాం.
జూన్ 8వ తేదీ నుంచి భక్తులకు నేరుగా శ్రీవారిని దర్శించి ప్రసాదాలు పొందే అవకాశం ఇస్తున్న నేపథ్యంలో ఆన్‌లైన్ ద్వారా లడ్డు డోర్ డెలివరీ సేవలను నిలిపేస్తున్నాం అని టిటిడి ప్రకటించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..