Tirumala Vaikunta Dwara Darshan Timings: వైష్ణ‌వాల‌యాల సంప్ర‌దాయాల‌ను పాటిస్తూ తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో డిసెంబ‌రు 23 నుంచి జ‌న‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వారం 10 రోజుల పాటు తెర‌చి ఉంచి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నభాగ్యం క‌ల్పిస్తామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లపై వివిధ విభాగాధిపతు‌తో సమావేశం నిర్వహించారు. ఈవో మీడియాతో మాట్లాడుతూ.. డిసెంబరు 23న తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభించి, జనవరి ఒకటో తేదీ రాత్రి 12 గంటలకు మూసివేస్తామన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"తిరుమ‌లలోని క్యూలైన్ల‌లో ఎక్కువ సేపు వేచి ఉండ‌కుండా శ్రీ‌వారి ద‌ర్శ‌నం చేసుకోవ‌డానికి వీలుగా డిసెంబ‌రు 22వ‌ తేదీ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి తిరుపతిలోని 9 కేంద్రాలలో 90 కౌంటర్ల ద్వారా కోటా పూర్త‌య్యేంత వ‌ర‌కు మొత్తం 4,23,500 స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు మంజూరు చేస్తాం. తిరుప‌తిలోని విష్ణునివాసం, శ్రీ‌నివాసం, గోవింద‌రాజ‌స్వామి స‌త్రాలు, భూదేవి కాంప్లెక్స్‌, రామచంద్ర పుష్క‌రిణి, ఇందిరా మైదానం, జీవ‌కోన హైస్కూల్‌, భైరాగిప‌ట్టెడ‌లోని రామానాయుడు హైస్కూల్‌, ఎంఆర్‌ప‌ల్లిలోని జడ్పీ హైస్కూల్‌లో ఉచితంగా స‌ర్వ‌ద‌ర్శ‌న టోకెన్లు పొంద‌వ‌చ్చు.." అని టీటీడీ ఈవో తెలిపారు. 


డిసెంబ‌రు 22వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్‌డీ టోకెన్లు రద్దు చేసినట్లు వెల్లడించారు. దర్శన టోకెన్లు గల భక్తులకు మాత్రమే తిరుమలలో గదులు కేటాయిస్తామన్నారు. తిరుమ‌ల‌లో గ‌దులు ప‌రిమితంగా ఉన్న కార‌ణంగా ఈ ప‌ర్వ‌దినాల‌లో భ‌క్తుల ర‌ద్దీ దృష్ట్యా తిరుప‌తిలో గ‌దులు పొందాల్సిందిగా భ‌క్తులకు విజ్ఞ‌ప్తి చేస్తున్నామన్నారు. గ‌తంలో మాదిరే ఈ సంవ‌త్స‌రం కూడా స్వ‌యంగా వ‌చ్చే ప్రోటోకాల్ వీఐపీల‌కు, కుటుంబ సభ్యులకు ప‌రిమిత సంఖ్య‌లో మాత్ర‌మే బ్రేక్ ద‌ర్శ‌నం కల్పిస్తామన్నారు. 10 రోజుల పాటు సిఫార‌సు లేఖ‌లు స్వీక‌రించమని చెప్పారు.


"వైకుంఠ ద్వార ద‌ర్శ‌న ఫ‌లితం 10 రోజ‌లు పాటు ఉంటుంది. వీఐపీలు, ఇత‌ర భ‌క్తులు ప‌ది రోజుల్లో ఏదో ఒక‌ రోజు ద‌ర్శ‌నం చేసుకోవ‌డానికి ప్ర‌ణాళిక‌లు రూపొందించుకోవాలి. టోకెన్లు, టికెట్లు పొందిన భ‌క్తుల‌ను 24 గంటలు ముందు మాత్ర‌మే తిరుమ‌లకు అనుమ‌తిస్తారు. టోకెన్లు లేని భ‌క్తులు తిరుమ‌ల‌కు రావచ్చు. కానీ ద‌ర్శ‌నం ఉండ‌దు. వారు తలనీలాలు సమర్పించి ఇతర సందర్శనీయ ప్రాంతాలను దర్శించుకోవచ్చు. ద‌ర్శ‌న టోకెన్లు పొందిన భ‌క్తులు త‌మ టోకెన్ల‌పై సూచించిన తేదీ, స‌మ‌యానికే శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి రావాల‌ని విజ్ఞ‌ప్తి. దూరప్రాంతాల్లో ఉన్న భ‌క్తులు టీటీడీ వెబ్‌సైట్‌, ఎస్వీబీసీ, ఇత‌ర మాధ్య‌మాల ద్వారా టోకెన్ల ల‌భ్య‌త తెలుసుకున్న త‌రువాతే తిరుమ‌ల ప్ర‌యాణం ఖ‌రారు చేసుకోవాలి.." అని టీటీడీ ఈవో సూచించారు.


Also Read: Google Trend Video: వీడు మగాడ్రా బుజ్జి..ఏకంగా 16 అడుగుల కింగ్ కోబ్రాకు ముద్దు పెట్టాడు..మీరే చూడండి..


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. డీఏ పెంపుపై అప్పుడే ప్రకటన


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి