Tirumala Break Darshan: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతున్న భక్తులకు ముఖ్యగమనిక. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వార దర్శనాన్ని పురస్కరించుకుని డిసెంబరు 19వ తేదీన మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సంద‌ర్భంగా డిసెంబరు 19న బ్రేక్ దర్శనాలను చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ కారణంగా డిసెంబరు 18న సోమవారం సిఫారసు లేఖలు స్వీకరించట్లేదని చెప్పారు. ఈ విషయాన్ని భక్తులు గమనించి.. స్వామి వారి దర్శనానికి ప్లాన్ చేసుకోవాలని సూచించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురువారం 56,049 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 26,748 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ కానుకలు రూ.3.97 కోట్లు ఆదాయం వచ్చింది. సర్వదర్శనం కోసం దర్శన్ సమయం (SSD టోకెన్లు లేకుండా) 24 గంటలు పడుతోంది. కాగా.. తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటి దీపిక పదుకొనే దర్శించుకున్నారు. తిరుమల కాలిబాటలో నడుచుకుంటూ వెళ్లిన ఆమె ఇవాళ స్వామి వారికి జరిగే నైవేధ్యం విరామం సమయంలో ఆలయంలోకి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. దీపికాను చూడ్డానికి ఆలయం ముందు అభిమానులు పోటీ పడ్డారు. ‌సెల్పీలు తీసుకుని సంబరపడిపోయారు.


తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దగ్గుబాటి సురేష్ బాబు దర్శించుకున్నారు. రాత్రి తిరుమలకు వెళ్లిన సురేష్ బాబు ఇవాళ స్వామి వారికి జరిగే నైవేధ్యం విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి మొక్కలు చెల్లించుకున్నారు. టీటీడీ అధికారులు, అర్చకులు దగ్గుపాటి సురేష్ బాబు కుటుంబ సభ్యులకు దర్శనం ఏర్పాటు చేశారు.


ధర్మప్రచారంలో భాగంగా నాలుగు వేదాల సారాన్ని ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసేందుకు 2024 ఫిబ్రవరి మొదటి వారంలో సహస్రపురుష వేదస్వస్తి చతుర్వేద పారాయణం నిర్వహిస్తామని.. ఇందుకోసం అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేప‌ట్టాలని టీటీడీ జేఈవో సదా భార్గవి అధికారులను ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌ణ‌పై తిరుపతిలోని పరిపాలన భవనంలో గురువారం అధికారులతో జేఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోక‌క్షేమం కోసం ప్ర‌జ‌లంద‌రికీ శాంతి సౌభాగ్యాలు, ఆరోగ్యం, అభ్యుద‌యం క‌ల‌గాల‌ని ఆకాంక్షిస్తూ ఈ పారాయ‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తామ‌న్నారు. 


ఇందుకోసం టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నం మైదానంలో ఏర్పాట్లు చేప‌ట్టాల‌ని కోరారు. ఇందుకోసం దేశంలోని వివిధ‌ ప్రాంతాల నుంచి ప్రముఖ పండితులను ఆహ్వానించాలన్నారు. శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలోని స్కీమ్‌ పారాయణదారులను కూడా భాగస్వాములను చేయాలని కోరారు. మూడు రోజులపాటు నిర్వ‌హించే ఈ కార్యక్రమానికి సంబంధించి ఆయా విభాగాల‌ అధికారులు సమన్వయం చేసుకొని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఇందుకోసం ఆహారం, వైద్యం, బస, కార్యక్రమ నిర్వ‌హ‌ణ‌, రవాణా తదితర కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు తరచూ సమావేశాలు నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


Also Read:  Bank Alerts: డిసెంబర్ 31లోగా బ్యాంకుకు వెళ్లి ఈ పని పూర్తి చేయకుంటే ఇబ్బందులు తప్పవు


Also Read: KCR Discharge: కోలుకున్న కేసీఆర్, యశోద ఆసుపత్రి నుంచి ఇంటికి డిశ్చార్జ్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి