ఏపీలోని చిత్తురు జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి వర్చువల్ ఆర్జిత సేవా టిక్కెట్లు కోటా నేడు విడుదల కానుంది. నేటి ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో శ్రీవారి వర్చువల్ ఆర్జిత సేవా టిక్కెట్ల కోటాను టీటీడీ (TTD) విడుదల చేయనుంది. ప్రతినెలా చివరి వారంలో ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటా విడుదల చేస్తారని తెలిసిందే. స్వామివారి కల్యాణోత్సవం టిక్కెట్లు కలిగిన భక్తులకు ఉచిత దర్శనం కల్పిస్తారు. నవంబర్ 22వ తేదీ నుంచి 30 వరకు వర్చువల్ ఆర్జిత సేవా టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది.  



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


కాగా, తిరుమలలో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను అక్టోబర్ చివరి వారంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పునఃప్రారంభించింది. అంతకుముందు ప్రకటించినట్లుగానే భూదేవి కాంప్లెక్స్‌లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా శ్రీవారి సర్వదర్శనం టికెట్లు జారీ చేస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనం ఒకరోజు ముందుగానే శ్రీవారి భక్తులు టోకెన్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచే భూదేవి కాంప్లెక్స్‌లో టోకెన్లు పొందిన భక్తులు మరుసటి రోజు శ్రీవారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook