Cyclone Alert: నివర్ సైక్లోన్ ప్రభావం నుంచి తేరుకోకముందే మరో రెండు తుపాన్లు పొంచి ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. డిసెంబర్ నెలలో పొంచి ఉన్న రెండు  తుపాన్లు..దక్షిణ తమిళనాడు, ఏపీలపై ప్రభావం చూపనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళనాడు కరైకల్ సమీపంలో తీరం దాటిన నివర్ సైక్లోన్ ( Nivar Cyclone ) ప్రభావం నుంచి తమిళనాడు, ఏపీ రాష్ట్రాలింకా తేరుకోలేదు. తుపాను పూర్తిగా బలహీనపడకముందే మరో రెండు తుపాన్లు ( Two more cyclones ) పొంచి ఉన్నాయనే వాతావరణ శాఖ హెచ్చరిక ఆందోళన కల్గిస్తోంది. ఈ రెండు తుపాన్లు బంగాళాఖాతంలో ఏర్పడనున్నాయని ఐఎండీ ( IMD ) అప్రమత్తం చేస్తోంది. ఈ నెల 29న బంగాళాఖాతంలో ( Bay of Bengal )  అల్పపీడనం ఏర్పడనుంది. ఈ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి..తరువాత తుపానుగా మారనుందని ఐఎండీ సూచిస్తోంది. ఈ తుపానుకు బురేవి ( Burevi cyclone ) అని పేరు పెట్టనున్నారు. డిసెంబర్ 2 నాటికి తుపానుగా మారనుంది. ఈ తుపాను ప్రభావం ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రా, రాయలసీమపై ఎక్కువగా ఉండనుందని తెలుస్తోంది. 


మరోవైపు డిసెంబర్ 5న బంగాళాఖాతంలోనే మరో అల్పపీడనం ఏర్పడనుందని..ఇది డిసెంబర్ 5 నాటికి టకేటి తుపాను ( Taketi cyclone ) గా మారనుందని వాతావరణ శాఖ చెబుతోంది. టకేటి తుపాను ప్రభావం డిసెంబర్ 7వ తేదీన దక్షిణ తమిళనాడు, ఏపీలపై తీవ్రంగా ఉండనుంది. Also read: Prakash Raj Comments on Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు!