Lockdown In Tirupati: కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ పెరుగుతున్న నేపథ్యంలో తిరుపతి ( Tirupati ) లో అధికారులు రెండు వారాల లాక్‌డౌన్ విధించారు. రోజుకు సుమారు వందకు పైగా కేసులు నమోదు అవుతోండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్-19 వైరస్‌ (  Covid-19 ) ను కట్టడి చేయడానికి అధికారులు విధించిన ఈ లాక్‌డౌన్ ( Lockdown ) ఆగస్టు 5 వరకు కొనసాగనుంది. అయితే ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు దుకాణాలు తెరిచే ఉంటాయి. మద్యం షాపులు ( Wine Shops )  కూడా  ఉదయం 11 గంటల వరకే తెరిచి ఉంటాయి. తిరుపతిలో 2 వేలకు పైగా కేసులు నమోదు కాగా... 22 మంది కరోనావైరస్ సంక్రమణ వల్ల మరణించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Safe From Coronavirus: కరోనా నుంచి కాపాడే 8 అలవాట్లు



కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు గత కొంత కాలంగా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కంటైన్మెంట్ జోన్లను ( Containment Zone ) కూడా ప్రకటించారు. అయినా సంక్రమణ అదుపులో రాకపోవడంతో ఈ మేరకు రెండు వారాల లాక్‌డౌన్ ప్రకటించారు. ఇక తిరుమల ( Tirumala ) వెళ్లే భక్తులు దర్శనం చేసుకోవడానికి సంబంధిత టోకెన్లు చూపిస్తే వారిని బైపాస్ మీదుగా ఆలయ ప్రాంగణం ( TTD Temple )  వద్దకు చేరుస్తారు.



Countries Without Covid-19: కరోనా వైరస్ నుంచి సురక్షితంగా ఉన్న దేశాలివే


 



Follow us on twitter