Ugadi Happy New Year: తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు, ప్రధాని తెలుగులో ట్వీట్
Ugadi Happy New Year: తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాది. తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ, గవర్నర్ విశ్వభూషణ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేసి ఆకట్టుకున్నారు.
Ugadi Happy New Year: తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాది. తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ, గవర్నర్ విశ్వభూషణ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేసి ఆకట్టుకున్నారు.
తెలుగు ప్రజల నూతన సంవత్సరాన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు ప్రజలకు ప్లవ నామ సంవత్సర శుభాకాంక్షలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ( Pm modi), ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌లు ట్వీట్ ద్వారా ఉాగాది శుభాకాంక్షలు ( Ugadi Wishes) అందించారు. ఉగాది పురస్కరించుకుని తెలుగు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో ట్వీట్ చేసి ఆకట్టుకున్నారు. మీరందరూ ఆయురారోగ్యాలతో , భోగభాగ్యాలతో వర్ధిల్లాలలని ప్రార్ధిస్తున్నట్టు ట్విట్టర్‌లో మోదీ తెలిపారు.
శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది పండుగ ( Ugadi New Year) అన్ని వర్గాలకూ శాంతి, సామరస్యం, ఆనందాన్ని తీసుకురావాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ( Viswabhushan Harichandan) ఆకాంక్షించారు. ఆయన సోమవారం ఓ ప్రకటనలో రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు లోగిళ్లలో ఆనందాల హరివిల్లు అయిన ఉగాది పండుగ ప్రతి ఇంటా శుభం కలుగజేయాలని ఆకాంక్షించారు. ప్రజలంతా కరోనా నిబంధనలను పాటిస్తూ ఉగాది పండుగ జరుపుకోవాలని ఆయన సూచించారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan)ఉగాది శుభాకాంక్షలు అందించారు. శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ఏడాది కూడా సమృద్ధిగా వానలు కురవాలి. పంటలు బాగా పండాలి. రైతులకు మేలు కలగాలి. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు సుభిక్షంగా ఉండాలి. పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ సంతోషాలతో కళకళలాడాలి. మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలి. తెలుగు వారికి.. మొత్తం ప్రపంచానికి కరోనా పీడ శాశ్వతంగా విరగడ కావాలి. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలి. ప్రతి ఒక్కరూ ఈ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
Also read: Ap Coronavirus: ఏపీలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న కరోనా సెకండ్ వేవ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook