Eluru Mystery Disease: ఏపీలో కలవరం కల్గించిన ఏలూరు ఘటనపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆరా తీశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ..అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికార్లకు సూచించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఏలూరు ( Eluru ) పట్టణంలో  గత కొద్దికాలంగా అంతు చిక్కని వింత వ్యాధి ( Mystery Disease ) పట్టి పీడిస్తోంది. ఈ వ్యాధి గురించి అధ్యయనం చేసేందుకు కేంద్ర వైద్య బృందాలు ( Central Teams ) వివిధ రకాలుగా అధ్యయనం చేస్తున్నాయి. బాధితుల శరీరాల్లో లెడ్, నికెల్ వంటి భారలోహాలున్నట్టు ఢిల్లీ ఎయిమ్స్ ( Delhi Aiims ) ఇప్పటికే నివేదిక విడుదల చేసింది. ఈ నేపధ్యంలో ఢిల్లీలోని తన నివాసంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ( Vice president Venkaiah naidu ) పరిస్థితిపై ఆరా తీశారు. కేంద్ర ఆరోగ్య శాఖ  కార్యదర్శి రాజేష్ భూషణ్,  ఉమ్మడి కార్యదర్శి లవ్ అగర్వాల్, ఇతర అధికార్లను కలిశారు. 


ప్రస్తుతం ఏలూరు పరిస్థితి ( Eluru Status )పై ప్రాథమిక నివేదిక అందిందని..తుది నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని వెంకయ్య నాయుడుకు వివరించారు. ఆల్ ఇండియా మెడికల్ ఇనిస్టిట్యూట్ కు చెంది నిపుణులు, పూణేకు చెందిన వైరాలజిస్టుల బృందం అధ్యయనం చేస్తోందన్నారు. ప్రస్తుతం ఏలూరులో కేసుల సంఖ్య తగ్గుతోందని ఉప రాష్ట్రపతికి వివరించారు. 


పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ..అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు..అధికార్లకు సూచించారు. తుది నివేదిక వచ్చిన తరువాత సంబంధిత శాఖలకు వెంటనే సమాచారం అందించాలన్నారు. Also read: Andhra Pradesh: డీజీపికి లేఖ రాసిన చంద్రబాబు