YSRCP About RBI's Decision: 2000 రూపాయల నోటును ఉపసంహరించుకుంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా మరోసారి చర్చనియాంశమైన సంగతి తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ సహా అన్ని రాజకీయ పక్షాలు తమ వైఖరిని స్పష్టంచేస్తున్నాయి. రూ. 2 వేల నోటును ప్రవేశపెట్టడమే బీజేపి సర్కారు తీసుకున్న తప్పుడు నిర్ణయం అని అప్పట్లోనే చెప్పామని.. తాజాగా ఆ 2 వేల రూపాయల నోటును కూడా రద్దు చేసి తమ మాటే నిజం చేసిందని కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టంచేశారు. బీజేపీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో పెద్ద నోట్ల రద్దు సైకిల్ పూర్తయినట్టయింది అని కేంద్ర మాజీ మంత్రులు పి చిదంబరం, జైరాం రమేష్ వంటి నేతలు అభిప్రాయపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలావుంటే, రూ. 2,000 నోటు రద్దుపై తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వైసీపీ, బీఆర్ఎస్ పార్టీల వైఖరి ఎలా ఉండనుంది అనేదే ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై వైఎస్సార్సీపీ పార్టమెంటరీ నేత, ఆ పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. రూ. 2 వేల నోట్ల రద్దును తాము స్వాగతిస్తున్నాం అని ప్రకటించారు.



ఇది కూడా చదవండి : FAQs About Rs 2000 Note:  2000 నోటు ఎప్పటివరకు చెల్లుతుంది ? ఎవరైనా ఇస్తే తీసుకోవచ్చా ? 


నల్ల ధనాన్ని అరికట్టేందుకు కేంద్రం తీసుకునే చర్యలకు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా నిలుస్తుందని ట్వీట్ చేసిన విజయసాయి రెడ్డి... తాజాగా 2000 నోట్లను రద్దు చేయాలన్న ఆర్‌బీఐ నిర్ణయాన్ని కూడా తాము స్వాగతిస్తున్నాం అని ఆ ట్వీట్ ద్వారా స్పష్టంచేశారు.


ఇది కూడా చదవండి : Rs 2000 Notes Why and What: ఆర్బీఐ రూ. 2000 నోటును ఎందుకు ఉపసంహరించుకుందో తెలుసా ?


ఇది కూడా చదవండి: RBI to Withdraw Rs 2000 Note: బడాబాబులకు మరోసారి షాకిచ్చిన కేంద్రం.. రూ. 2 వేల నోటు మళ్లీ వెనక్కి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK