Vijayawada: విజయవాడలో గ్యాంగ్ వార్.. ఫుట్‌బాల్ ప్లేయర్‌ను కత్తులతో పొడిచి చంపిన ప్రత్యర్థులు
Vijayawada Football Player Murder: విజయవాడలో గ్యాంగ్ వార్ ఓ ఫుట్‌బాల్ ప్లేయర్ హత్యకు దారితీసింది. ఆకాశ్ అనే యువకుడిని ప్రత్యర్థులు కత్తులతో పొడిచి చంపారు.
Vijayawada Football Player Murder: విజయవాడలో ఓ ఫుట్‌బాల్ ప్లేయర్ దారుణ హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు అతన్ని కత్తితో పొడిచి హతమార్చారు. మృతుడి శరీరంపై మొత్తం 16 కత్తిపోట్లు ఉన్నాయి. టోనీ అనే వ్యక్తి అనుమానాస్పద మృతి తర్వాత రెండు గ్యాంగ్స్ మధ్య జరిగిన గొడవే ఈ హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. హత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే... విజయవాడలోని వాంబేకాలనీలో టోనీ అనే వ్యక్తి మంగళవారం (మే 30) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. టోనీ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం జీజీహెచ్‌కు తరలించగా... పెద్ద ఎత్తున అతని అనుచరులు అక్కడికి చేరుకున్నారు. వీరిలో రెండు గ్రూపులు ఉన్నాయి. కాసేపటికి సమీపంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో వీరంతా మద్యం తాగేందుకు వెళ్లారు.
మద్యం సేవిస్తున్న క్రమంలో ఆకాశ్ (23) అనే యువకుడికి ప్రత్యర్థి గ్యాంగ్‌కు మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన ఆకాశ్ ప్రత్యర్థి గ్యాంగ్‌లో ఓ వ్యక్తిపై దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయి స్నేహితుడి గదికి వెళ్లాడు. ఆకాశ్ వెనకాలే ప్రత్యర్థులు అతను ఉన్న గది వద్దకు వెళ్లారు. మద్యం, గంజాయి మత్తులో ఉన్న ఆ గ్యాంగ్... ఆకాశ్ ఉన్న గదిలోకి చొరబడ్డారు.
ఆ సమయంలో ఆకాశ్‌తో పాటు మరో ముగ్గురు ఉండగా... ప్రత్యర్థి గ్యాంగ్ గదిలోకి రాగానే ఇద్దరు పారిపోయారు. మరో యువకుడిని బెదిరించి గది నుంచి బయటకు వెళ్లగొట్టారు. ఆపై కత్తులతో ఆకాశ్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. దాడిలో ఆకాశ్ మృతి చెందడంతో అక్కడి నుంచి పరారయ్యారు. పారిపోయిన స్నేహితులు తిరిగొచ్చేసరికి ఆకాశ్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అతని శరీరంపై మొత్తం 16 కత్తి పోట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Also Read: LPG Cylinder Price: బిగ్ రిలీఫ్... భారీగా తగ్గిన ఎల్‌పీజీ సిలిండర్ ధర... ఏయే నగరాల్లో ఎంతంటే..
Also Read: Sidhu Moose Wala: మీసాలు దిద్ది.. పెళ్లి కొడుకులా అలంకరించి సిద్ధూ మూసే వాలా అంత్యక్రియలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook