Vijaywada Floods Fear: విజయవాడను ముంచేసిన బుడమేరు ప్రస్తుతానికి శాంతించినా ఇంకా వరద మాత్రం వీడలేదు. సింగ్‌నగర్ సహా నగరంలోని చాలా కాలనీల్లో ఇంకా వరద, బురద పేరుకుని ఉన్నాయి. వరద తగ్గడంతో ఇళ్లు ఖాళీ చేసి బయటకు వచ్చేస్తున్నారు. విద్యుత్ సరఫరా ఎప్పటికి పునరుద్ధరిస్తారో తెలియడం లేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడటంతో పాటు భారీ వర్షసూచన జారీ అయింది. ఈసారి అల్పపీడనం తుపానుగా మారనుందని ఐఎండీ చేసిన హెచ్చరికలతో విజయవాడ వాసుల్లో భయం ఆవహిస్తోంది. సింగ్‌నగర్‌కు మళ్లీ వరద భయం పొంచి ఉందనే వార్తలు వస్తున్నాయి. బుడమేరు పొంగి పొర్లడం లేదా గండి పడటం జరగవచ్చని భయపడుతున్నారు. అందుకే వరద తగ్గడంతో ఇళ్లు వాకలి ఖాళీ చేసి బయటకు వచ్చేస్తున్నారు. కరెంటు కూడా లేకపోవడంతో అక్కడ ఉండలేని పరిస్థితి. మరోవైపు ఇళ్లలో ఎక్కడ పాములు చేరి దాక్కున్నాయోననే భయం వెంటాడుతోంది. కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. 


సింగ్‌నగర్ సహా చుట్టుపక్కల కాలనీల్లో గత నాలుగు రోజులుగా విద్యుత్ సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విష జ్వరాలు ప్రబలుతున్నాయి. వరదలతో సర్వం కోల్పోయిన ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ సాయం అందరికీ అందడం లేదనే విమర్శలు పెద్దఎత్తున విన్పిస్తున్నాయి. తాగు నీరు, పాలు, ఆహారం లేక జనం అవస్థలు పడుతున్నారు. 


చుట్టుపక్కల లాడ్జిలకు డిమాండ్


సింగ్‌నగర్ చుట్టుపక్కల కాలనీల నుంచి బయటపడిన కొంతమంది నగరంలోని లాడ్జీల్లో బస చేస్తున్నారు. ఆర్ధికంగా భారమైనా పాముల భయం, తాగు నీటి కష్టాలు ఇతర అవస్థల కారణంగా తప్పని పరిస్థితుల్లో హోటల్స్‌లో రూమ్స్ తీసుకుని ఉంటున్నారు. దాంతో లాడ్జీలకు డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించాక కూడా వెంటనే విద్యుత్ వినియోగించుకోలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా ఇళ్లలో స్విచ్ బోర్డ్‌లలో నీళ్లు చేరుకుని ఉన్నాయి. ఈ సమయంలో కరెంట్ వస్తే మొత్తం షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అందుకే మెయిన్స్ ఆఫ్ చేస్తున్నారు. కరెంట్ వచ్చినా ముందు స్విచ్ బోర్డులు మరమ్మత్తులు చేయించుకోవాలి. 


Also read: Vijayawada Floods: వరద తగ్గినా ఇళ్లలోకి వెళ్లలేని స్థితి, పాముల భయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.