Chiranjeevi On Pawan Kalyan: ఈసారైనా చట్టసభలోకి జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ అడుగుపెటడతాడా? అని సర్వత్రా చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓటమిపాలైన పవన్‌ ఈసారి పిఠాపురం నియోజకవర్గానికి పరిమితమయ్యారు. ఎలాగైనా గెలిచి సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్న పవన్‌కు మద్దతుగా సినీ పరిశ్రమలోని కొందరు ప్రచారంలోకి వచ్చారు. ఇక పవన్‌కు ఎప్పుడూ అండగా ఉండే చిరంజీవి ఎన్నికల సమయంలో పూర్తి మద్దతు ప్రకటించారు. తన తమ్ముడు కోసం పిఠాపురం ప్రజలకు చిరంజీవి ఒక సందేశం ఇచ్చారు. తన తమ్ముడిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Narendra Modi: వైసీపీ పాలనలో అభివృద్ధి సున్నా.. వచ్చేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే


'కొణిదెల పవన్‌ కల్యాణ్‌. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టినా అందరికీ మంచి చేయాలి.. మేలు జరగాలి అనే విషయంలో ముందుంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువ ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడిది. ఎవరైనా అధఙకారంలోకి వచ్చాక ప్రజలకు ఏమైనా చేయాలనుకుంటారు. కానీ పవన్‌ కల్యాణ్‌ తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు చేయడం, సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడే జవాన్ల కోసం పెద్ద మొత్తం అందించడం, మత్స్యకారులకు సహాయం చేయడం చూస్తుంటే.. ఇలాంటి నాయకుడు కదా ప్రజలకు కావాలి అనిపిస్తోంది' అని చిరంజీవి తెలిపారు.

Also Read: AP New DGP: ఏపీ కొత్త పోలీస్‌ బాస్‌ హరీశ్‌కుమార్‌ గుప్తా.. గంటల్లోనే వేగంగా మారిన పరిణామాలు


రాజకీయాల్లో పవన్‌ ఎదుర్కొంటున్న పరిస్థితిపై తన తల్లి బాధపడితే నచ్చజెప్పినట్లు చిరంజీవి వివరించారు. 'ఏ తల్లికైనా తన కుమారుడు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. ఏ అన్నకైనా తన తమ్ముడు అవస్థలు పడుతుంటే బాధేస్తుంది. అలా బాధ పడుతున్న నా తల్లికి ఒక మాట చెప్పా. నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, వాళ్ల బిడ్డల భవిష్యత్‌ కోసం చేసే యుద్ధం ఇది అన్నాను. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచి వాళ్ల వల్లనే ప్రజాస్వామ్యానికి మరింత నష్టమని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు' అని పవన్‌ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు కురిపించాడు.


'తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాల కోసం అంకితం చేసిన వ్యక్తి పవన్‌ కల్యాణ్‌. రాష్ట్ర భవిష్యత్‌ కోసం శక్తిని వినియోగించాలి అంటే చట్టసభల్లో అతడి గొంతును మనం వినాలి. జనమే జయం అని నమ్మే జనసేనాని ఏం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు పవన్‌ కల్యాణ్‌ను గెలిపించాలి. మీకు సేవకుడిగా.. సైనికుడిగా.. అన్నయ్యగా నిలబడతాడు. మీకోసం కలబడి మీ కలలను నిజం చేస్తాడు. గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి పవన్‌ కల్యాణ్‌ను గెలిపించండి. జై హింద్‌' అంటూ పిఠాపురం ప్రజలకు చిరంజీవి పిలుపునిచ్చారు.


విస్తృత ప్రచారం
ఈసారి ఎమ్మెల్యే కావాలని పూర్తి కసి మీద ఉన్న పవన్‌ కల్యాణ్‌ పిఠాపురంపైనే ప్రధాన దృష్టి పెట్టారు. అతడికి మద్దతుగా సినీ, బుల్లితెర ప్రముఖులు ప్రచారంలో పాల్గొంటున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా కూడా కొందరు పవన్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఇక్కడ అధికార వైఎస్సార్‌సీపీ బలంగా ఉంది. మాజీ మంత్రి వంగా గీత బరిలో నిల్చోగా ఆమె ప్రచారంలో దూసుకెళ్తున్నారు. జగనన్నపై అభిమానం.. అందించిన సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయనే ధీమాలో గీత ఉండగా.. టీడీపీ, బీజేపీ, జనసేనలు కలిసినా పవన్‌ కల్యాణ్‌ గెలుపు కష్టంగా ఉంది.





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter