AP: దేశవ్యాప్తంగా వ్యవసాయచట్టంపై చర్చ నడుస్తోంది. వ్యవసాయబిల్లులు ప్రవేశపెట్టినప్పుడు ఏ పార్టీలు మద్దతు పలికాయన్నది ఆసక్తి రేపుతోంది. మరి ఏపీలో అధికారపార్టీ వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు మద్దతు పలికింది..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కేంద్ర ప్రభుత్వం ( Central Government ) కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయచట్టాలపై ఇప్పుడు రైతులు సమ్మె చేస్తున్నారు. గత 11 రోజులుగా జరుగుతున్న సమ్మె ఇంకా కొనసాగుతోంది. డిసెంబర్ 8వ తేదీన భారత్ బంద్ ( Bharat Bandh ) జరగనుంది. ఈ నేపధ్యంలో ఏపీలో వైసీపీ - టీడీపీలు నువ్వంటే నువ్వేనంటూ ఆరోపణలు చేసుకుంటున్నాయి. 


పార్లమెంట్‌లో వ్యవసాయబిల్లుల్ని( Agriculture bills ) ప్రవేశపెట్టినప్పుడు అధికార పార్టీ వైసీపీ, టీడీపీలు రెండూ మద్దతిచ్చాయి. ఇప్పుడు రైతుల సమ్మె నేపధ్యంలో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ( Telugu desam ) వైసీపీపై విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై ఏపీ మంత్రి కన్నబాబు మండిపడ్డారు.


చంద్రబాబు నాయుడు ( Chandrababu naidu )..ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. అబద్ధం చెప్పనిదే చంద్రబాబుకు పూట గడవడం లేదని మంత్రి కన్నబాబు ( Minister kannababu ) మండిపడ్డారు. పార్లమెంట్‌లో వ్యవసాయ బిల్లుకు టీడీపీ ఎంపీలు మద్దతు తెలిపారని గుర్తు చేశారు. టీడీపీ పార్లమెంట్‌లో ఒకలా.. బయట మరోలా వ్యవహరిస్తోందని చెప్పారు. ఢిల్లీలో రైతులు ఆందోళన ( Farmers strike ) చేస్తుండటంతో చంద్రబాబు ఇప్పుడు హఠాత్తుగా  యూటర్న్‌ తీసుకున్నారని విమర్శించారు. 


వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా చంద్రబాబు..ప్రధానికి ఎందుకు లేఖ రాయలేదని మంత్రి ప్రశ్నించారు. ఎంఎస్‌పీ అంటే కనీస గిట్టుబాటు ధర కొనసాగుతుందని ప్రధాని చెప్పిన తర్వాతే తాము మద్దతు తెలిపామని..మంత్రి తెలిపారు. ఇప్పటికీ కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్రంలో ఎంఎస్‌పీ కొనసాగిస్తున్నామన్నారు. 


రాష్ట్ర ప్రభుత్వ చర్యలను పార్లమెంట్‌లో వివరించామన్నారు. ఏపీ ( Ap ) లో ప్రతి పంటకు మద్దతు ధర ప్రకటించామని..గ్రామస్థాయిలో మార్కెటింగ్ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. చరిత్రలోనే మొట్టమొదటి సారిగా గ్రేడెడ్ ఎంఎస్‌పీ ప్రవేశపెట్టామన్నారు. అసలు చంద్రబాబు హయాంలో రైైతులకు మేలు చేసే ఆలోచన ఎప్పుడైనా చేశారా అని ప్రశ్నించారు.  Also read: AP CM YS Jagan: ఏలూరులో పర్యటించనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్