YS Sharmila: అదానీ ఒప్పందంపై జగన్ తన బిడ్డలపై ప్రమాణం చేయాలి.. వైఎస్ జగన్‌కు షర్మిల ఛాలెంజ్!
YS Sharmila Challenge To Ex CM YS Jagan Swear: అమెరికాలో కేసు నమోదైన వేళ గౌతమ్ అదానీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో చిచ్చు రేపగా.. వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.
YS Jagan Swear: గౌతమ్ అదానీ అవినీతి వ్యవహారంలో తన సోదరుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమేయం ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపిస్తున్నారు. అదానీ, జగన్ అవినీతి ఒప్పందంపై తాను గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు షర్మిల సంచలన ప్రకటన చేశారు. అదానీ విషయంలో తాను తప్పు చేయలేదని వైఎస్ జగన్ తన పిల్లలపై ప్రమాణం చేయాలని షర్మిల సవాల్ విసిరారు. జగన్ ప్రభుత్వంతో అదానీ కుదుర్చుకున్న ఒప్పందంపై దర్యాప్తు చేయాలని గవర్నర్ కోరినట్లు వెల్లడించారు.
ఇది చదవండి: Tirumala: అల్లరల్లరి అవుతున్న తిరుమల.. ప్రాంక్ వీడియోలకు అడ్డాగా పవిత్ర క్షేత్రం
విజయవాడలో బుధవారం ఏర్పాటుచేసినన ఓ కార్యక్రమంలో వైఎస్ షర్మిల కీలక విషయాలు వెల్లడించారు. 'జగన్, అదానీ ఒప్పందంపై దర్యాప్తు జరిపించాలని గవర్నర్‌ను కోరాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు భారం.. లాభం అదానీకి. అదానీకి లాభం కోసమే ఈ ఒప్పందం' అని వివరించారు. ఈ ఒప్పందం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారని సంచలన ప్రకటన చేశారు. రాబోయే 25 ఏళ్లు ఈ ఒప్పందం అంటే వచ్చే తరాన్ని కూడా తాకట్టు పెట్టినట్లేనని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది చదవండి: Vijay Paul Arrest: ఏపీలో కీలక పరిణామం.. రఘురామకృష్ణరాజు వేధింపుల కేసులో విజయ్ పాల్ అరెస్ట్
ప్రజలకు నష్టం వచ్చినా పర్వాలేదు..కానీ అదానీ కి లాభం కావాలని వైఎస్ జగన్ ప్రయత్నించారని వైఎస్ షర్మిల తెలిపారు. అదానీతో ఒప్పందం ద్వారా రూ.లక్షల కోట్ల భారం పడుతుందని చెప్పారు. ఇలాంటి ముడుపుల ఒప్పందాలతో ప్రజలపై విద్యుత్ భారం పడిన గుర్తుచేశారు. ఇంత జరిగినా రాష్ట్రం కానీ, కేంద్రం కానీ ఒక్క విచారణ కమిషన్ కూడా వేయలేదని ఆగ్రహం వయక్తం చేశారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. అతడి అవినీతి అమెరికాలో బయటపడితే ఇక్కడ దర్యాప్తు సంస్థలు అన్ని అదానీ చేతుల్లో ఉండడంతో ఎవరికీ తెలియడం లేదు. అంతర్జాతీయ స్థాయిలో మన పరువు పోయింది' అని షర్మిల వల్లడించారు.
అదానీ దేశం పరువు తీయగా.. వైఎస్ జగన్ రాష్ట్రం పరువు తీశాడని వైఎస్ షర్మిల ప్రకటించారు. అదానీపై అమెరికాలో చర్యలకు అక్కడి కోర్టులు.. అరెస్టులకు పోలీసులు సిద్ధమవుతున్నా మన ప్రభుత్వం కనీసం ఒక్క చర్య కూడా లేదని గుర్తుచేశారు. ఇక్కడ చంద్రబాబు కూడా చర్యలకు వెనకడుగు వేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌తో అదానీ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తారా లేదా? అని ప్రశ్నించారు. జగన్ అవినీతిపై దర్యాప్తుకు చంద్రబాబుకు మనసు రావడం లేదని విమర్శించారు.
'జగన్ ముడుపులు తీసుకున్నాడని అన్ని ఆధారాలు ఉన్నాయి. అదానీతో నేరుగా ముడుపులు మాట్లాడుకున్నారని ఆధారాలు ఉన్నాయి. లంచాల కోసమే జగన్ ఆ ఒప్పందాలకు సంతకాలు పెట్టారు. వెంటనే చర్యలు తీసుకోవాలి' అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. తాను అవినీతి పరుడు కాకపోతే వైఎస్ జగన్ తన బిడ్డల మీద ప్రమాణం చేయాలని వైఎస్ షర్మిల ఛాలెంజ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.