Priyanka Jain Prank Video: ప్రపంచవ్యాప్తంగా తిరుమల క్షేత్రం ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందింది. కలియుగ దైవంగా భావించే ఏడు కొండలపై సోషల్ మీడియా పిచ్చిలో కొందరు విపరీత చర్యలకు పాల్పడుతున్నారు. నేరు ప్రధాన ఆలయంలోకి కూడా ఫోన్‌లు తీసుకెళ్తున్న దారుణ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నా సోషల్ మీడియా పిచ్చోళ్లు ఎలాగోలా ఆలయ పవిత్రతను తమ చర్యలతో దెబ్బ తీస్తున్నారు. మొన్న భక్తుల మనోభావాలతో తమిళ యూట్యూబర్స్ ప్రాంక్ చేయగా.. తాజాగా బిగ్‌బాస్ ఫేమ్ నటులు తిరుమల భక్తులతో ఆడుకున్నారు. వరుస సంఘటనలతో తిరుమల క్షేత్రం పవిత్రత మసకబారుతోంది. అత్యంత భక్తి ప్రపత్తులతో తిరుమలను దర్శించుకోవాల్సి ఉండగా సోషల్ మీడియా పిచ్చిలో పడి భక్తిని పక్కకు నెట్టేస్తున్నారు.
ఇది చదవండి: Vijay Paul Arrest: ఏపీలో కీలక పరిణామం.. రఘురామకృష్ణరాజు వేధింపుల కేసులో విజయ్ పాల్ అరెస్ట్
బిగ్‌బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ కొన్ని నెలల కిందట శ్రీవారి దర్శనానికి వచ్చారు. తిరుపతి నుంచి అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్తూ స్నేహితులతో చిరుత పులి వచ్చిందని ప్రాంక్ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. శ్రీవారి భక్తులను భయాందోళన కలిగించేలా వారు చేసిన తీరు సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. తీవ్ర దుమారం రేపడంతో తన అకౌంట్ నుంచి ఈ వీడియోను ప్రియాంక డిలీట్ చేశారు. తిరుమల పోలీసులు ప్రియాంక జైన్, ఆమెకు కాబోయే భర్త శివకుమార్‌పై కేసు నమోదు చేసి హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. త్వరలోనే వీరు విచారణ ఎదుర్కోవాల్సి ఉంది.
ఇది చదవండి: Rajya Sabha Election: ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నికల సమరం.. ఈసీ షెడ్యూల్ విడుదల
కాగా గతంలో తమిళనాడు యూట్యూబర్లు కూడా విచ్చలవిడితనంతో రెచ్చిపోయారు. 'టీటీడీ అధికారిగా ఓ యువకుడు వచ్చి క్యూ లైన్‌లో వేచి ఉన్న భక్తులను దర్శనానికి వదిలేలా గేట్ తెరుస్తున్నాం అనేట్టు నటించిన ప్రాంక్ వీడియో కూడా తీవ్ర దుమారం రేపింది. ఆ వీడియోపై తీవ్ర విమర్శలు రావడంతో తిరుమల పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఎలాంటి అల్లరి చేష్టలు చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెర్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
కఠిన చర్యలు
ప్రాంక్‌ల పేరిట భక్తుల మనోభావాలతో ఆడుకుంటే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని తిరుమల విజిలెన్స్, పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో తిరుమలలో కెమెరాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సిద్ధమవుతోంది. అందరి అభిప్రాయాలు తీసుకుని ఇలాంటి ప్రాంక్‌లు.. రీల్స్ వంటి వాటిపై కొన్ని కఠిన చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. కొత్త పాలకవర్గం తిరుమల పవిత్రత పరిరక్షణకు కట్టుబడి ఉండడంతో ఈ సోషల్ మీడియా వీడియోలపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.