YS Sharmila: ఆ విషయంలో చంద్రబాబు నోరు విప్పాలి.. ట్విటర్లో నిలదీసిన వైఎస్ షర్మిల
YS Sharmila Questioned CM Chandrababu: వైద్య విద్య ప్రైవేటీకరణ జరుగుతోందని జరుగుతున్న ప్రచారంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు.
AP Medical College: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్య కళాశాలల అంశంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. వైద్య కళాశాలల విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేసి వైద్యాన్ని ప్రైవేటు పరం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా షర్మిల కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు.
Also Read: Schools Holiday: ఏపీ విద్యార్థులకు మరో సెలవు.. వరుస సెలవులతో పిల్లలు ఎంజాయ్
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేసి వైద్య విద్యను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చూస్తున్నారా? అని షర్మిల ప్రశ్నించారు. ఇప్పటికే అందని ద్రాక్షలా మారిన వైద్య విద్యను పేద విద్యార్థులకు మరింత దూరం చేసే ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? నిలదీశారు. గుజరాత్ పీపీపీ విధానంపై ఎందుకు అధ్యయనం చేయాలని అనుకున్నారు? అని సందేహం వ్యక్తం చేశారు. ఏపీలో జరుగుతున్న ప్రచారంపై చంద్రబాబు వెంటనే నోరు విప్పాలని డిమాండ్ చేశారు.
Also Read: YS Jagan: రాజకీయాల్లో వైఎస్ జగన్ బొమ్మ రచ్చ.. ఏపీలో తీవ్ర దుమారం
వైద్య విద్య ప్రైవేటీకరణపై సమాధానం చెప్పాలని షర్మిల కోరారు. కూటమి సర్కార్‌లో భాగస్వామ్య పక్షంగా ఉండి ఈ ఏడాది 5 కొత్త కాలేజీలైన పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పాడేరుల్లో వసతులను కల్పించలేమని, నిర్వహించడం సాధ్యపడదని, అదనపు సీట్లు కూడా అవసరం లేదని మెడికల్ బోర్డుకి లేఖ రాయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది' అని తెలిపారు. ప్రభుత్వ రంగంలో అదనపు సీట్లు వస్తుంటే ఏ రాష్ట్రమైనా వద్ధనుకుంటుందా? అని సందేహం వ్యక్తం చేశారు. ఇది కూటమి సర్కారుకు సిగ్గుచేటు అని తెలిపారు. కొత్తగా 750 సీట్లు సమకూరకపోవడం మీ నిర్లక్ష్యం ఫలితమే అని ధ్వజమెత్తారు. రూ.లక్షలు పోసి లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకున్న పిల్లల భవిష్యత్‌ను అగమ్య గోచరంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.