Ap Municipal Elections Results 2021: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనకు నిదర్శనమే మున్సిపల్ ఎన్నికల ఫలితాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. రెండేళ్ల వైఎస్ జగన్ పాలనకు ప్రజలిచ్చిన తీర్పు అని తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు(Ap municipal elections results)వెలువడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీ, నగర పంచాయితీలకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది. తాడిపత్రి మున్సిపాలిటీ తప్ప దాదాపు అన్నీ క్లీన్‌స్వీప్ చేస్తోంది. మున్సిపల్ ఫలితాలపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna reddy) మాట్లాడారు. వైఎస్ జగన్ తన రెక్కల కష్టంతో నిర్మించుకున్న పార్టీ వైఎస్సార్‌సీపీ అని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయానికి క్రెడిట్ అంతా సీఎం జగన్‌ను ఆశీర్వదించిన ప్రజలదేనని అన్నారు. 20 నెలల్లో ఆయన చేసిన అభివృద్ధికి ఈ ఫలితాలు నిదర్శనమని తెలిపారు. 


దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఫలితాలు వచ్చాయిని చెప్పారు. ఒక నాయకుడిపై ఇంతగా విశ్వాసం చూపించడం దేశంలో ఇదే తొలిసారి అని చెప్పారు. చంద్రబాబు(Chandrababu)ను ప్రజలు చెత్తబుట్టలో వేశారనే సంగతి ఆయనకు కూడా తెలుసన్నారు. తామైతే  ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నామని..కానీ చంద్రబాబు ఆ పదవికి కూడా అర్హుడిని కానని నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ పట్ల ప్రజలకు ఏకపక్షంగా చూపించిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలిపారు. 


Also read: Ap Municipal Elections results: మూడు రాజధానులకే ప్రజా మద్దతు, మున్సిపల్ ఫలితాలే నిదర్శనం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook