Ap Municipal Elections results: మూడు రాజధానులకే ప్రజా మద్దతు, మున్సిపల్ ఫలితాలే నిదర్శనం

Ap Municipal Elections results: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ క్లీన్‌స్వీప్ చేస్తోంది. ఫ్యాన్ గాలికి సైకిల్ పత్తా లేకుండా పోయింది. అధికార వికేంద్రీకరణకే ప్రజలు పట్టం కట్టారని మున్సిపల్ ఎన్నికలు రుజువు చేశాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 14, 2021, 02:06 PM IST
  • ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ క్లీన్ స్వీప్
  • అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశంలో ప్రజల మద్దతు ఉందనడానికి నిదర్సనం
  • విజయవాడ, గుంటూరు జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్
Ap Municipal Elections results: మూడు రాజధానులకే  ప్రజా మద్దతు, మున్సిపల్ ఫలితాలే నిదర్శనం

Ap Municipal Elections results: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ క్లీన్‌స్వీప్ చేస్తోంది. ఫ్యాన్ గాలికి సైకిల్ పత్తా లేకుండా పోయింది. అధికార వికేంద్రీకరణకే ప్రజలు పట్టం కట్టారని మున్సిపల్ ఎన్నికలు రుజువు చేశాయి.

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు(Ap Municipal elections results) వెల్లడవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీ, నగర పంచాయితీల ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తం అన్ని ప్రాంతాల్లోనూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా స్పష్టంగా కన్పిస్తోంది. ఫ్యాన్ గాలికి సైకిల్ పత్తా లేకుండా పోయింది. ఉనికి చాటుకోడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ, జనసేనలకు పూర్తిగా నిరాశే ఎదురైంది. అన్నింటికీ మించి వైఎస్ జగన్ ప్రభుత్వం(Ys jagan government) తీసుకొచ్చిన అధికార వికేంద్రీకరణకు ప్రజలు పట్టం కట్టినట్టు స్పష్టంగా అర్ధమౌతోంది. విజయవాడ, గుంటూరు ఫలితాలే నిదర్శనమని తెలుస్తోంది. అమరావతి రైతుల ఆందోళన మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపలేదని అర్ధమౌతోంది. విజయవాడ, గుంటూరు ప్రజానీకం మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉన్నారంటూ టీడీపీ చేస్తూ వచ్చిన ప్రచారంలో వాస్తవం లేదని తెలిసిపోయింది. 

గుంటూరు కార్పొరేషన్(Guntur corporation)సహా మున్సిపాల్టీలన్నింటినీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. తెనాలి, చిలకలూరిపేట, రేపల్లె, మాచర్ల,సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్ల మున్సిపాల్టీలతో పాటు గుంటూరు కార్పొరేషన్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అటు విజయవాడ కార్పొరేషన్‌లో వైసీపీ ఆధిక్యం స్పష్టంగా కొనసాగుతోంది. కృష్ణా జిల్లాలోని మున్సిపాల్టీల్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (Ysr congress party)హవా కన్పిస్తోంది. తాడిపత్రి మినహా మరెక్కడా టీడీపీ ఇప్పటి వరకూ ఖాతా తెరవలేకపోవడం గమనార్హం. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీ స్పష్టమైన ఆధిక్యం కనబర్చడం అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశాని ( Three capital issue)కి ప్రజల్లో వ్యతిరేకత లేదనడానికి నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. 

Also read: YSRCP: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ హవా.. క్లీన్‌స్వీప్ దిశగా దూసుకెళ్తోన్న వైఎస్సార్‌సీపీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News