YSRCP Varra Arrest: ఒకపుడు సోషల్ మీడియా లేనపుడు.. ఇరత పార్టీల వ్యక్తులను విమర్శించడానికి ప్రత్యర్థుల పోస్టర్స్ పై పేడ వేసేవారు. అటు హీరోల  అభిమానులు కూడా ఇదే ఫాలయ్యేవారు. సోషల్ మీడియా వచ్చాకా.. ప్రత్యర్థులను టార్గెట్ చేయడానికి ఇతి పెద్ద అస్త్రంలా మారింది. తమకు సంబంధించిన పాజిటివ్ అంశాలను ప్రచారం చేసేకంటే ప్రత్యర్థులను చులకన చేయడం.. వారినీ బజారుకు ఈడ్చడం వంటివి ఎక్కువయ్యాయి. ఏపీలో ఈ తరహా రాజకీయాలు మరీ ఎక్కువ అయ్యాయి. ఇందులో టీడీపీ, వైసీపీ, జనసేన అనే తేడా లేకుండా ప్రత్యర్దులపై అడ్డూ అదుపు లేకుండా   విరుచు పడుతున్నారు. అధికారంలో ఏపార్టీ ఉంటే.. ప్రత్యర్థి పార్టీల సోషల్ మీడియా ఇన్ ఫ్యూయన్సర్ లను టార్గెట్ చేయడం ఎక్కువ అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ విమర్శలు ఓ లిమిట్ వరకు బాగానే ఉన్నా.. హద్దులు దాటితేనే ప్రమాదం. తాజాగా వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా నేత  వర్రా రవీందర్‌రెడ్డిని ఏపీ పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.  కర్నూలు మీదుగా హైదరాబాద్‌ ను పారిపోతుండగా.. మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో ప్రత్యేక పోలీసు బృందాలు అరెస్టు చేశాయి. తొలుత వర్రా రవీందర్‌రెడ్డిని కడప తరలించారు.


ఎంపీ అవినాశ్‌రెడ్డి ప్రధాన అనుచరుడిగా వర్రా ఉన్నాడు. వర్రా రవీందర్‌రెడ్డి సోషల్‌ మీడియాలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రులు లోకేశ్, అనిత, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, జగన్‌ తల్లి విజయమ్మ, మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీతలపై సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టినట్లు ఆరోపణలున్నాయి.  దాంతో మంగళగిరి, హైదరాబాద్‌లో అతనిపై  కేసులు నమోదయ్యాయి. అయితే తన భర్త ఏం తప్పు చేయలేదని, ఏమైనా జరిగితే దానికి ప్రభుత్వానిదే బాధ్యత అంటున్నారు వర్రా రవీందర్‌ రెడ్డి భార్య.


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.