Ambati Rambabu: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు రెండోసారి కరోనా పాజిటివ్
Ambati Rambabu Tests Positive for COVID-19: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మరోసారి కరోనా వైరస్ బారిన పడ్డారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిర్వహించిన కోవిడ్19 పరీక్షలలో ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. కానీ కరోనా వైరస్ రెండోసారి సోకుతుండటం ఏపీ ప్రజలతో పాటు నేతలను ఆందోళనకు గురిచేస్తోంది.
Ambati Rambabu Tests Positive for COVID-19: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా చాలా తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. కానీ కరోనా వైరస్ రెండోసారి సోకుతుండటం ఏపీ ప్రజలతో పాటు నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు (YSRCP MLA Ambati Rambabu) మరోసారి కరోనా వైరస్ బారిన పడ్డారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిర్వహించిన కోవిడ్19 పరీక్షలలో ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు.
కొన్ని రోజుల కిందట అంబటికి కరోనా సోకడం తెలిసిందే. అయితే చికిత్స అనంతరం కోలుకుని మళ్లీ తన కార్యక్రమాలలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పాల్గొంటున్నారు. తాజాగా మరోసారి కరోనా వైరస్ బారిన పడ్డారని వైసీసీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. తాను రెండోసారి కరోనా వైరస్ బారిన పడటంపై ఎమ్మెల్యే అంబటి రాంబాబు (Ambati Rambabu) స్పందించారు.
Also Read : WhatsApp Amazing Features: ఈ వాట్సాప్ ఫీచర్స్‌ను మీరు ట్రై చేశారా!
‘ఈ జులైలో తొలిసారి కోవిడ్19 బారిన పడ్డాను. అయితే త్వరగానే కోలుకున్నాను. తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిర్వహించిన కోవిడ్-19 టెస్టులలో పాజిటివ్‌గా తేలింది. అయితే మరోసారి కరోనా బారిన పడటం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. వైద్యుల సలహాలు పాటిస్తాను. అవసరమైతే ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతాను. మీ ఆశీస్సులతో మరోసారి కరోనాను జయిస్తానని’ YSRCP ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు.
Also Read : Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!
కాగా, అసెంబ్లీ సమావేశాలకు హాజరైన అంబటి రాంబాబును పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కలిశారు. అంబటికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఇటీవల ఆయన కలిసిన వ్యక్తులతో పాటు ఆయనను కలిసిన నేతలలో ఆందోళన నెలకొంది. వారు సైతం కోవిడ్19 టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. గత ఐదారు రోజుల్లో తనను కలిసిన వారు హోం క్వారంటైన్‌లో ఉండాలని, లేకపోతే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే అంబటి సూచించారు.
Also Read : Bigg Boss Telugu 4: ఫైనల్ చేరిన తొలి కంటెస్టెంట్ అఖిల్.. డేంజర్ జోన్‌లో అతడే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe