Ysrcp strategy in Budget session: కర్నూలుకు హైకోర్టు తరలింపుపై పార్లమెంట్ లో ప్రస్తావన
Ysrcp strategy in Budget session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం సిద్ధమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్..ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా చర్చ సాగాలని సూచించారు.
Ysrcp strategy in Budget session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం సిద్ధమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్..ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా చర్చ సాగాలని సూచించారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ( Parliament Budget Session ) జనవరి 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ( Ysr Congress Party ) సమాయత్తమవుతోంది. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో పార్టీ ఎంపీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై వైఎస్ జగన్ ( Ap cm ys jagan )దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రత్యేక హోదా వంటి అంశాలపై కీలకమైన చర్చ సాగింది.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి( Vijayasai reddy )..పోలవరం ( Polavaram ) నిధులు, ప్రత్యేక హోదా ( Special Status ) అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతామని చెప్పారు. అదే విధంగా నివర్ సైక్లోన్ ( Nivar Cyclone ) నష్టపరిహారం విడుదలపై ప్రస్తావిస్తామన్నారు. ప్రధానంగా కర్నూలుకు హైకోర్టు ( Kurnool High court ) తరలింపు అంశాన్ని ప్రస్తావించనున్నామని విజయసాయిరెడ్డి తెలిపారు. రాష్ట్ర రెవిన్యూ లోటు, విశాఖ రైల్వే జోన్ ( Visakha Railway Zone ) అంశాలపై మాట్లాడనున్నామన్నారు. మరోవైపు రాష్ట్రంలో దేవుడి విగ్రహాల ధ్వంసంలో చంద్రబాబు ( Chandrababu ) ప్రమేయం ఉందని..దీనికి సంబంధించిన ఆధారాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. సున్నితమైన ఈ అంశాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు చెప్పారు.
Also read: Supreme court on local elections: పంచాయితీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook