7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, హోలీకి ముందే 90 వేలు పెరగనున్న జీతం
7th Pay Commission: దేశంలోని కోట్లాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. కరవు భత్యం పెరగనుంది. ఫలితంగా 90 వేల రూపాయలు ప్రతి ఉద్యోగి లాభం పొందనున్నారు. డీఏ ఎంత పెరుగుతుంది, ఎప్పుడు పెరుగుతుందనేది నిర్దారణైపోయింది.
7th Pay Commission: దేశంలోని కోట్లాదిమంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. కరవుభత్యం పెంపు కోసం ఎదురుచూస్తుంటే..ఇక ఆ నిరీక్షణ తొలగినట్టే. పింఛన్‌దారులు, ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరగనుంది. డీఏ ఈసారి ఎంత పెరగనుంది, ఎప్పుడు పెరగనుందనే వివరాలు తెలుసుకుందాం..
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 38 శాతం డీఏ లభిస్తోంది. జనవరి 2023 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 42 శాతం డీఏ లభించనుంది. అంటే మరో 4 శాతం డీఏ పెరగనుంది. దాంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం 90 వేల రూపాయలు పెరగనుంది. కేంద్ర కార్మిక శాఖ జారీ చేసిన గణాంకాల ఆధారంగా ఈ వివరాలు తెలుస్తున్నాయి.
డీఏ ఎంత పెరగనుంది
కరవుభత్యం లెక్కింపు ప్రతి నెలా కార్మిక శాఖ జారీ చేసే ఏఐసీపీఐ సూచీ ద్వారా ఉంటుంది. కార్మిక శాఖ జారీ డిసెంబర్ ఏఐసీపీఐ సూచీని జనవరి నెలలో జారీ చేసింది. 7వ వేతనసంఘం సిఫార్సుల ప్రకారం ఇండస్ట్రియల్ సెంటర్స్ కోసం ఏఐసీపీఐ సూచీతో డీఏ లెక్కింపు ఉంటుంది. కరవుభత్యంలో 4.23 శాతం పెంపు ఉంటుంది.
హోళీ అనంతరం అదనపు జీతం
కేంద్ర కార్మిక శాఖ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం డీఏలో పెంపు ప్రయోజనం ఉద్యోగులు, పెన్షనర్లకు జనవరి 1 నుంచి కలగనుంది. మీడియా నివేదికల ప్రకారం ప్రభుత్వం హోలీ కంటే ముందు ఉద్యోగుల డీఏను పెంచనుంది. అంటే వచ్చే నెల నుంచి ఉద్యోగులకు పెరిగిన జీతం రావచ్చు.
90 వేల రూపాయలు పెరగనున్న జీతం
7వ వేతనసంఘం నుంచి లభించిన సమాచారం ప్రకారం ఉద్యోగుల డీఏలో పెరుగుదల తరువాత ఉద్యోగి జీతం 30 వేలుంటే..అతడి గ్రాస్ జీతంలో దాదాపు 10,800 రూపాయలు పెంపు ఉంటుంది. అంటే ఇందులో ఏడాది జీతం లెక్కేస్తే జీతంలో 90 వేలు లేదా అంతకంటే ఎక్కువే పెంపు ఉండవచ్చు.
డీఏ ఎప్పుడెప్పుడు పెరగనుంది
ఆరు నెలల సమీక్ష తరువాత ఏఐసీపీఐ గణాంకాల ఆధారంగా డీఏను ఏడాదిలో రెండుసార్లు పెంచుతారు. డీలో పెరుగుదలపై హోలీకు ముందే స్పష్టత రావచ్చు.హోలీ తరువాత పెరిగిన జీతం రావచ్చు. డీఏ పెంపుతో దేశంలోని 68 లక్షల ఉద్యోగులు గరిష్టంగా 47 లక్షలమందికి ప్రయోజనం కలగనుంది ఏడాది ప్రారంభంలో డీఏను 3-4 శాతం పెంచింది ప్రభుత్వం. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 38 శాతమైంది. ఈసారి 3-4 శాతం పెంచడం ద్వారా మొత్తం డీఏ 41-42 శాతానికి చేరవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook