DA Hike Latest Update: 7వ వేతన సంఘం ప్రకారం జనవరి 2023 డీఏ పెంపుపై ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే పెరిగిన డీఏ ఎరియర్లు ఎప్పుడు వస్తాయనే విషయంపై ఉన్న సందిగ్దత ఇప్పుడు తొలగిపోయింది. సిబ్బంది ఖాతాల్లో భారీగా నగదు జమ కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7వ వేతన సంఘం ప్రకారం ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా ఏడాదికి రెండు సార్లు డీఏ పెంపు ఉంటుంది. గత ఏడాది అంటే 2022 రెండవ దఫా 4 శాతం డిఏ పెరగడంతో 34 నుంచి 38కు చేరుకుంది. ఈ ఏడాది అంటే 2023 జనవరి డీఏను మరో 4 శాతం పెంచడంతో 38 నుంచి 42 శాతానికి చేరుకుంది డీఏ. అయితే ఈ డీఏ పెంపు ప్రకటన మార్చ్ నెలలో వెలువడినా డబ్బులు ఎప్పుడు జమ అవుతాయనేది సందిగ్దంగానే ఉండేది. ఇప్పుడీ విషయంలో స్పష్టత ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఏప్రిల్ 30వ తేదీన ఉద్యోగుల ఖాతాల్లో నేరుగా ఎరియర్ల రూపంలో డబ్బులు జమ కానున్నాయి. అంటే ఏప్రిల్ నెలలో ఉద్యోగుల ఎక్కౌంట్లలో 1.20 లక్షల రూపాయలు జమ కానున్నాయి. ఈ నెల జీతంతో పాటు బకాయిలు చెల్లించనుంది. ఫలితంగా 1 కోటి కంటే ఎక్కువమంది ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభావితమౌతారు. మూడు నెలల ఎరియర్లు రావల్సి ఉన్నాయి.


38 నుంచి 42 శాతానికి చేరుకున్న డీఏ


కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ డిసెంబర్ 2022 లో ఏఐ సీపీఐ ఇండెక్స్ దాదాపుగా 132.3గా ఉంది. ఆ తరువాత మోదీ ప్రభుత్వం డీఏను 4 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది మార్చ్ 24వ తేదీన డీఏను 38 నుంచి 42 శాతం చేసింది. 


Also Read: 7 Seater Car @ Rs 5.25 lakhs: ఎర్టిగా, ఇన్నోవాలను వెనక్కి నెట్టేసిన 7 సీటర్ కారు, ధర కేవలం 5.25 లక్షలే, ఇవే ఫీచర్లు


దీని ప్రకారం ఉద్యోగులకు 3 నెలల డబ్బులు ఒకేసాకి చేతికి అందుతాయి. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి బేసిక్ శాలరీ 30 వేల రూపాయలైతే..జీతంలో 12 వందల రూపాయలు అధికంగా వస్తాయి. దాంతోపాటు ఏడాదికి లెక్కేస్తే 14,400 రూపాయలు పెరుగుతాయి. దీంతోపాటు కేబినెట్ ఉన్నతాధికారులకు జీతం నెలకు 10 వేల రూపాయలు పెరుగుతుంది. కేబినెట్ సెక్రటరీ స్థాయి ఉద్యోగుల జీతం 2.50 లక్షల రూపాయలుంటుంది. ఈ లెక్కన జీతం ఆధారంగా 1.20 లక్షలు పెరగనున్నాయి.


కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ధరలు ఎలా పెరుగుతాయో అదే విధంగా డీఏ పెంచుతుంటుంది. ఆ ప్రకారమే ఉద్యోగుల జీతం పెరుగుతుంటుంది. ప్రభుత్వం ఏడాదిలో రెండుసార్లు డీఏ పెంపు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, పెన్షనర్లకు వర్తిస్తుంది. 


Also Read: Maruti Swift @ Rs.1 lakh: కేవలం లక్ష రూపాయలతో మారుతి స్విఫ్ట్ ఇంటికి తీసుకెళ్లండి, ఈఎంఐ ఎంత, ఫీచర్లు ఏంటి



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook