Maruti Swift @ Rs.1 Lakh: బంపర్ ఆఫర్.. కేవలం లక్ష రూపాయలకే మారుతి స్విఫ్ట్.. త్వరపడండి!

Buy Maruti Swift @ Rs.1 Lakh: దేశంలో అందుబాటులో ఉన్న కార్లలో మారుతి స్విఫ్ట్ స్థానం ప్రత్యేకం. అత్యంత ప్రాచుర్యం పొందిన కార్లు. అందుకే ప్రతి నెలా విక్రయాల్లో మారుతి కంపెనీ కార్లే అగ్రస్థానంలో నిలుస్తుంటాయి. పూర్తి వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 14, 2023, 01:13 PM IST
Maruti Swift @ Rs.1 Lakh: బంపర్ ఆఫర్.. కేవలం లక్ష రూపాయలకే మారుతి స్విఫ్ట్.. త్వరపడండి!

Buy Maruti Swift @ Rs.1 Lakh: దేశంలో ఏళ్ల తరబడి ప్రజల మనస్సులు గెల్చుకుంటున్న కారు మారుతి. ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ లాంచ్ చేస్తూ అగ్రస్థానంలో నిలుస్తోంది. ఇప్పటికే టాప్ బెస్ట్ సెల్లింగ్ కార్లలో మారుతి కంపెనీ కార్లదే అగ్రస్థానం. అలాంటి బెస్ట్ సెల్లింగ్ కారుని కేవలం 1 లక్ష రూపాయలతో ఇంటికి తీసుకువెళ్లవచ్చు.

దేశంలో అత్యధికంగా విక్రయమమైన కార్లలో గత నెల మారుతి స్విఫ్ట్‌దే అగ్రస్థానం. మార్చ్ నెలలో ఈ కారు 17,559 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. దేశంలో ఇదే అత్యధికం. ఈ కారు ధర 6 లక్షల నుంచి ప్రారంభమై..9.03 లక్షల వరకూ ఉంది. మారుతి స్విఫ్ట్ దేశంలో అత్యంత ఆదరణ పొందిన కారు.  మారుతి స్విఫ్ట్ టాప్ మోడల్ కొనాలనుకుంటే ప్రతి నెలా వాయిదా ఎంత చెల్లించాలి, ఎంత డౌన్‌పేమెంట్ అనే వివరాలు తెలుసుకుందాం..

మారుతి స్విఫ్ట్ టాప్ మోడల్ స్విఫ్ట్ జెడ్‌ఎక్స్‌ఐ ప్లస్ డీటీ ఏఎంటీ ZXI Plus DT AMT. ఈ కారు ధర 9.03 లక్షలు. ఢిల్లీ ఆన్‌రోడ్ అయితే 10.12 లక్షల రూపాయలు. మీరు కూడా ఈ కారు కొనాలనుకుంటుంటే..ఈఎంఐ ఎంత పడుతుందనే వివరాలు తెలుసుకుందాం.

1 లక్ష చెల్లించి ఇంటికి తీసుకెళ్లే సదుపాయం..

మారుతి స్విఫ్ట్ ధరలో 10 శాతం డౌన్ పేమెంట్ అంటే 1 లక్ష రూపాయలుచెల్లించి ఈ కారును మీ సొంతం చేసుకోవచ్చు. అంటే బ్యాంకు లోన్ ద్వారా కారు కొనుగోలు చేయవచ్చు. వడ్డీ 10 శాతం కింద లెక్కేసుకుంటే..లోన్ కాల పరిమితితి 1-7 ఏళ్ల వధ్యలో ఉండవచ్చు. అంటే 5 ఏళ్లకు లెక్కేస్తే నెలకు ఈఎంఐ 19,381 రూపాయలైంది. అంటే 5 ఏళ్లకు లోన్ మొత్తంపై 2.50 లక్షలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది.

Also Read: Twitter Merger News: మూడో కంటికి తెలియకుండా విలీనం చేసిన ఎలాన్ మస్క్, ట్విట్టర్ కధ ముగిసిందా

మారుతి సుజుకి స్విఫ్ట్ ఇంజన్, ఫీచర్లు..

మారుతి స్విఫ్ట్‌లో 1.2 లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 90 పీఎస్ , 112 ఎన్ఎం పవర్ అందిస్తుంది. ఇంజన్ తో పాటు 5 స్పీడ్ మేన్యువల్ ట్రాన్స్‌మి‌షన్, 5 స్పీడ్ ఏఎంటీ గేర్ బాక్స్ ఉన్నాయి. ఇంజన్‌లో మైలేజ్ పెంచేందుకు ఒక స్టార్ట్, స్టాప్ ఫీచర్ కూడా ఉంది.పెట్రోల్ మోడ్‌లో 22 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుండగా, సీఎన్జీ వెర్షన్ 30.90 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. ఈ కారు ఫీచర్ల గురించి పరిశీలిస్తే 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్‌ఫో‌టైన్ మెంట్ సిస్టమ్, హైట్ ఎడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, క్రూయిజ్ కంట్రోల్, ఆటో ఏసీ, ఎల్ఈడీ హైడ్ లైట్స్ ఉన్నాయి.

Also Read: 7 Seater Car @ Rs 5.25 lakhs: ఎర్టిగా, ఇన్నోవాలను వెనక్కి నెట్టేసిన 7 సీటర్ కారు, ధర కేవలం 5.25 లక్షలే, ఇవే ఫీచర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News