7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. పెరిగిన డీఏ సెప్టెంబర్ జీతంతో లభించడమే కాకుండా..జూలై నుంచి వర్తించనుంది. నవరాత్రి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా డబ్బు లభించనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం కోసం నిరీక్షణ ముగిసిపోనుంది. ప్రభుత్వం త్వరలోనే ఈ విషయాన్ని వెల్లడించనుంది. డీఏ ఎప్పట్నించి ఇస్తారో తేదీ ఖరారైంది. జీ బిజినెస్ అందించిన వివరాల ప్రకారం..కరవు భత్యం డీఏను సెప్టెంబర్ 28న ప్రకటించనున్నారు. సెప్టెంబర్ జీతంలో రెండు నెలల ఏరియర్స్‌తో పాటు అంటే జూలై, ఆగస్టు డీఏ ఏరియర్స్‌తో పాటు లభించనుంది. 


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ నిర్ణయించేందుకు ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా భావిస్తారు. ఏఐసీపీఐ ఐడబ్ల్యూ తొలి ఆరు నెలల గణాంకాంలు వచ్చేశాయి. జూన్ నెల సూచచీ 129.2కు చేరుకుంది. ఇండెక్స్ పెరగడంతో డీఏ 4 శాతం పెరగడం ఖాయమైంది. కరవు భత్యం 4 శాతం పెరగడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 38 శాతానికి చేరుకుంటుంది. పెరిగిన డీఏను సెప్టెంబర్ నెల జీతంతో ఇవ్వనున్నారు. జూలై 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అంటే నవరాత్రి పర్వదినాల ప్రారంభంలో సెప్టెంబర్ నెల జీతం అందుకునేటప్పుడు జూలై, ఆగస్టు నెలల డీఏ ఏరియర్స్‌తో కలిపి పెద్ద మొత్తం నగదు చేతికి అందుతుంది. 


డీఏ ఎంత ఉంటుంది


కరవుభత్యంలో 4 శాతం పెరుగుదలతో 38 శాతానికి చేరుకోనుంది. ప్రస్తుతం డీఏ 34 శాతంగా ఉంది. డీఏ 38 శాతం కావడంతో జీతం భారీగా పెరుగుతుంది. 4 శాతం డీఏ పెరగడంతో మ్యాగ్జిమమ్, కనీస వేతనాలు ఎలా మారనున్నాయో చూద్దాం..ఏఐసీపీఐ సూచిక ప్రకారం డీఏ ఎంత పెంచాలనేది నిర్ణయమౌతుంది. జూలై నెల నుంచి పెరిగిన డీఏ అందుతుండటంతో..సెప్టెంబర్ నెల జీతం అంటే దసరాకు ఉద్యోగులకు భారీగా డబ్బులు అందనున్నాయి.


మ్యాగ్జిమమ్ బేసిక్ శాలరీపై 4 శాతం డీఏ పెంపు ప్రభావం


ఉద్యోగి కనీస జీతం                                                      56,900
కొత్త కరవు భత్యం 38 శాతంతో                                      21,622 నెలకు
ప్రస్తుత కరవు భత్యం 34 శాతంతో                                19,346 నెలకు
పెరగనున్న డీఏ మొత్తం                                              2260 నెలకు
ఏడాది జీతంపై పెంపు                                                 27,120 రూపాయలు


కనీస బేసిక్ శాలరీపై పెంపు ప్రభావం


ఉద్యోగి కనీస జీతం                                                        18000 నెలకు
కొత్త కరవు భత్యం                                                            6840 నెలకు
ప్రస్తుతం డీఏ                                                                  6120 నెలకు
పెరిగిన డీఏ                                                                     1080 నెలకు
ఏడాది జీతంపై పెంపు                                                     8640 నెలకు


Also read: Vivo Y33T Smartphone : వివో వై33టీ స్మార్ట్ ఫోన్‌పై అదిరిపోయే ఆఫర్.. అమెజాన్‌లో ఇప్పుడు కేవలం రూ.1490కే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook