Vivo Y33T Smartphone : వివో వై33టీ స్మార్ట్ ఫోన్‌పై అదిరిపోయే ఆఫర్.. అమెజాన్‌లో ఇప్పుడు కేవలం రూ.1490కే..

Vivo Y33T Smartphone : ప్రముఖ ఈకామర్స్ సైట్ అమెజాన్‌లో వివో వై33టీ స్మార్ట్ ఫోన్‌పై ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ద్వారా అతి చౌక ధరకే వివో వై33టీ స్మార్ట్ ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చు.

Written by - Srinivas Mittapalli | Last Updated : Sep 1, 2022, 03:52 PM IST
  • లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఆఫర్స్
  • అమెజాన్‌లో వివో వై33టీ స్మార్ట్ ఫోన్‌పై 22 శాతం డిస్కౌంట్
  • ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా..
Vivo Y33T Smartphone : వివో వై33టీ స్మార్ట్ ఫోన్‌పై అదిరిపోయే ఆఫర్.. అమెజాన్‌లో ఇప్పుడు కేవలం రూ.1490కే..

Vivo Y33T Smartphone : ప్రముఖ ఈకామర్స్ సైట్ అమెజాన్‌లో స్మార్ట్ ఫోన్లపై బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. రిటైల్ స్టోర్స్‌ ధరతో పోలిస్తే అమెజాన్‌లో తక్కువ ధరకే బెస్ట్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం అమెజాన్ వివో వై33 టీ (8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ)పై ఆకర్షణీయమైన డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాదు, ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...

అమెజాన్‌లో 22 శాతం డిస్కౌంట్

వివో వై33టీ (8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ) అసలు ధర రూ.22,990. కానీ అమెజాన్ దీనిపై 22 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. తద్వారా రూ.17,990కే ఈ స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు. అంటే.. రూ.5 వేలు వరకు ఆదా అయినట్లే. ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ మహీంద్రా తదితర బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులపై నో కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది.

అమెజాన్‌లో ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా

వివో వై33టీ (8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ) స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్ ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. మీ పాత స్మార్ట్ ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ద్వారా గరిష్ఠంగా రూ.16,500 వరకు డిస్కౌంట్ పొందుతారు. తద్వారా రూ.17,990కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్‌ని మరింత చౌకగా రూ.1490కే కొనుగోలు చేయవచ్చు. అయితే ఎక్స్‌చేంజ్ కోసం మీరిచ్చే స్మార్ట్ ఫోన్ కండిషన్‌ పైనే తగ్గింపు ఆధారపడి ఉంటుంది.

వివో వై33టీ ఫీచర్స్ :

50MP+2MP+2MP బ్యాక్ కెమెరా సెటప్ | 16MP ఫ్రంట్ కెమెరా సెటప్
6.58 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే (2408 x 1080 పిక్సెల్ రిజల్యూషన్)
8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ
ఫన్ టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా కోర్ ప్రాసెసర్
5000 mAh బ్యాటరీ (టైప్ సీ)

Also Read: Asia Cup 2022: సూర్యకుమార్‌ యాదవ్‌పై సర్వత్రా ప్రశంసలు..అతడిని మూడో స్థానంలో పంపాలన్న మాజీ ప్లేయర్..!

Also Read: K.Laxman: ఎన్డీఏలోకి టీడీపీ చేరబోతోందా..? బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్‌ ఏమన్నారంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News