IPO News: కటారియా ఇండస్ట్రీస్ ఐపీవో బంపర్ లిస్టింగ్.. ఒక్క నిమిషంలో రూ.1 లక్షకు రూ. 2 లక్షల లాభం..!!
IPO News: కటారియా ఇండస్ట్రీస్ నేడు ఉదయం NSE SME సూచీలో లిస్ట్ అయ్యింది. ఈ రోజు NSE SMEలో కటారియా ఇండస్ట్రీస్ షేర్లు రూ. 182 వద్ద లిస్ట్ అయి ట్రేడింగ్ ప్రారంభించాయి. కంపెనీ ఐపీవో ఇష్యూ ధర రూ. 96 కాగా దాదాపు 90 శాతం ఎక్కువ లాభంతో. కటారియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు లిస్ట్ అవడం విశేషం. అయితే కటారియా ఇండస్ట్రీస్ IPO జూలై 16 నుంచి షేర్లను ఆహ్వానిస్తూ బిడ్డింగ్ కోసం తెరుచుకుంది.
IPO News:ఈ సంవత్సరం ఐపీవో మార్కెట్లో కూడా మంచి సందడి నెలకొని ఉంది. తాజాగా నేడు లిస్ట్ అయిన కటారియా ఇండస్ట్రీస్ ఐపీవో ఇన్వెస్టర్ల పాలిట కొంగు బంగారంగా నిలిచింది. ముఖ్యంగా ఈ కంపెనీ తన ఇన్వెస్టర్లు డబుల్ లాభాలను అందించింది. దీంతో ఐపీవో ద్వారా షేర్లు పొందిన వారు పండగ చేసుకుంటున్నారు. కటారియా ఇండస్ట్రీస్ నేడు ఉదయం NSE SME సూచీలో లిస్ట్ అయ్యింది. ఈ రోజు NSE SMEలో కటారియా ఇండస్ట్రీస్ షేర్లు రూ. 182 వద్ద లిస్ట్ అయి ట్రేడింగ్ ప్రారంభించాయి. కంపెనీ ఐపీవో ఇష్యూ ధర రూ. 96 కాగా దాదాపు 90 శాతం ఎక్కువ లాభంతో. కటారియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు లిస్ట్ అవడం విశేషం.
అయితే కటారియా ఇండస్ట్రీస్ IPO జూలై 16 నుంచి షేర్లను ఆహ్వానిస్తూ బిడ్డింగ్ కోసం తెరుచుకుంది. అలాగే ఈ ఐపీవో జూలై 19న ముగిసింది. కటారియా ఇండస్ట్రీస్ ఐపీఓ ద్వారా మొత్తం రూ.54.58 కోట్లు సమీకరించింది. అయితే నిపుణుల కంపెనీ బంపర్ లిస్టింగ్ ముందే ఊహించారు. గ్రే మార్కెట్ లో కూడా కంపెనీ షేర్లు మంచి లిస్టింగ్ సూచించాయి. అందుకు తగ్గట్టుగానే నేడు కంపెనీ షేర్లు ఉదయం లిస్టు అవగానే అప్పర్ సర్క్యూట్‌ను తాకాయినేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో కంపెనీ షేర్లు లిస్ట్ అయిన కొద్ది నిమిషాల్లోనే, కటారియా ఇండస్ట్రీస్ షేర్లు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ.191.50 వద్ద నిలిచింది.
నిజానికి మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం కటారియా ఇండస్ట్రీస్ ఐపీవో గ్రే మార్కెట్ రూ. 105 ప్రీమియంతో నడిచింది . నిజానికి కటారియా ఇండస్ట్రీస్ IPO రూ. 201 వద్ద లిస్ట్ అవుతుందని అంతా భావించారు. అయితే గ్రే మార్కెట్ అంచనాలకు అనుగుణంగా కంపెనీ షేర్లు దాదాపు 90 శాతం లాభంతో లిస్ట్ అయ్యాయి.
Also read: Union Budget 2024 Updates: ఏపీ రాజధాని అభివృద్ధికి 15 వేల కోట్ల కేటాయింపు
కటారియా ఇండస్ట్రీస్ IPO ప్రైస్ బ్యాండ్ ఇదే:
కటారియా ఇండస్ట్రీస్ IPO ప్రైస్ బ్యాండ్ ప్రకారం ఒక్కో షేరుకు రూ.91 కనిష్టంగానూ, రూ. 96 గరిష్టంగానూ బిడ్ వేయాల్సి ఉంటుంది. ఐపీవో ఒక లాట్ కోసం కనిష్టంగా 1200 షేర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే రూ.1,15,200 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కటారియా ఇండస్ట్రీస్ IPO పెట్టుబడిదారుల నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది.
కంపెనీ ఏం చేస్తుంది?
కటారియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ చరిత్ర విషయానికి వస్తే ఈ కంపెనీ 2004లో స్థాపించారు. కంపెనీ ప్రధానం పారిశ్రామిక ఉత్పత్తులైన లో రిలాక్సేషన్ ప్రీ-స్ట్రెస్డ్ కాంక్రీట్ (LRPC) స్ట్రాండ్‌లు, స్టీల్ వైర్లు, కప్లర్లు, పోస్ట్-టెన్షనింగ్ (PT) ఎంకరేజ్ సిస్టమ్స్ (యాంకర్ కోన్స్, యాంకర్ హెడ్‌లు) SPE తయారీ చేస్తుంది. షీటింగ్ నాళాల అల్యూమినియం కండక్టర్లను తయారు చేసి సరఫరా చేస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook