Airtel Netflix Offer: ప్రముఖ టెలీకాం సంస్థ 'ఎయిర్‌టెల్' పలు పోస్ట్ పెయిడ్ ప్లాన్స్‌పై నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. ఈ ప్లాన్స్‌తో రీచార్జ్ చేసుకునేవారు నెట్‌ఫ్లిక్స్ యాక్సెస్ కోసం అదనపు చెల్లింపులు జరపాల్సిన అవసరం లేదు. అంతేకాదు, ఈ ప్లాన్స్ ద్వారా అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా పొందవచ్చు. ఆ ప్లాన్స్ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎయిర్‌టెల్ రూ.1199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ :


ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు నెలకు 150 జీబీ డేటాతో పాటు 30 జీబీ అదనపు డేటా, 200 జీబీ వరకు రోల్ ఓవర్ కేపబిలిటీ పొందుతారు. డేటా లిమిట్ దాటితే ఒక ఎంబీ డేటాకు రెండు పైసలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌తో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లతో పాటు రూ.199కి లభించే బేసిక్ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. అంతేకాదు, ఒక ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. అంతేకాదు, వింక్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్, షా అకాడమీ లైఫ్‌ టైమ్ యాక్సెస్ కూడా పొందవచ్చు.


ఎయిర్‌టెల్ రూ.1599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ :


ఈ ప్లాన్‌తో రీచార్జ్‌ చేసుకునే ఎయిర్‌టెల్ కస్టమర్లకు రూ.499తో కూడిన స్టాండర్డ్ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. అలాగే ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. అంతేకాదు, వింక్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్, షా అకాడమీ లైఫ్‌ టైమ్ యాక్సెస్ కూడా పొందవచ్చు. ఈ ప్లాన్‌తో రోజకు 100 ఎస్ఎంఎస్‌లు, నెల పాటు రోజుకు 250 జీబీ డేటా, 200 జీబీ వరకు రోల్ ఓవర్ డేటా పొందుతారు. డేటా లిమిట్ దాటితే ఒక ఎంబీ డేటాకు రెండు పైసలు చెల్లించాల్సి ఉంటుంది. 


Also read: Flipkart mobile fest: ఫ్లిప్​కార్ట్ మంత్​ ఎండ్ మొబైల్ సేల్​.. అన్ని ఫోన్లపై భారీ తగ్గింపు!


Also read: Realme C31: రియల్​మీ నుంచి మరో బడ్జెట్​ స్మార్ట్​ఫోన్- తక్కువ ధరలోనే అదిరే ఫీచర్లు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook