Amazon Profits: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి చరిత్ర సృష్టించింది. అమెరికా చరిత్రలోనే రికార్డు స్థాయి లాభాలు ఆర్జించింది. టెస్లా రికార్డును బద్దలుకొట్టి..పైచేయి సాధించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచంలో అత్యధిక ధనవంతుల జాబితాలో స్థానాలు తరచూ మార్చుకునేది అమెజాన్, టెస్లా కంపెనీలే. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఇప్పుడు మరోసారి చరిత్ర సృష్టించే లాభాల్ని ఆర్జించింది. అమెరికా చరిత్రలోనే ఇది అత్యధికమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా మార్కెట్‌లో ఒక్కరోజులోనే 190 బిలియన్ డాలర్లు అంటే 14.18 లక్షల కోట్లు లాభాలు సంపాదించింది. మొదటి త్రైమాసిక ఫలితాలు ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడంతో షేర్ మార్కెట్ కూడా 13.5 శాతం లాభపడింది. అమెరికాకు చెందిన మరో సంస్థ ఫేస్‌బుక్ ఒక్కరోజులో అత్యధిక నష్టాన్ని చవిచూస్తే..అమెజాన్ అత్యధిక లాభాలు ఆర్జించడం విశేషం.


అంతకముందు జనవరి 28వ తేదీన వెలువడిన ఫలితాల ప్రకారం టెస్లా షేర్లు భారీగా ట్రేడ్ అయ్యాయి. ఒక్కరోజులోనే 181 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ సాధించింది టెస్లా. ఇప్పుడీ రికార్డును అమెజాన్ 190 బిలియన్ డాలర్లతో బద్దలుగొట్టింది. త్రైమాసిక ఫలితాలు ఆకట్టుకోవడం, అమెరికాలో ప్రైమ్ సభ్యత్వ ధరల్ని పెంచడమే దీనికి కారణంగా తెలుస్తోంది. అదే సమయంలో కొనుగోలు కంటే అమ్మకం ఆర్డర్లే ఎక్కువగా కన్పించాయి. ప్రముఖ కంపెనీలు ఏటీఅండ్టీ, మోర్గాన్ స్టాన్లీ, నెట్‌ఫ్లిక్స్ వంటి కంపెనీల మార్కెట్ విలువకు సమానంగా అమెజాన్ (Amazon) ఒక్కరోజులో సంపాదించింది. 


Also read: Jio Down: జియో సేవలకు అంతరాయం- ట్విట్టర్​లో ట్రెండ్ అవుతున్న మీమ్స్​!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook