Jio Down: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో సేవలకు శనివారం అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ముంబయి సర్కిల్లోని యూజర్లు నెట్వర్క్ సమస్యలను ఎదుర్కొన్నారు.
ఔట్ గోయింగ్ కాల్స్, ఇన్కమింగ్ కాల్స్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చాలా మంది వెల్లడించారు. ఇక ఇంటర్నెట్ సేవలు సైతం వినియోగించుకోలేకపోతున్నట్లు తెలిపారు.
ట్విట్టర్లో యూజర్ల ఫైర్..
నెట్వర్క్ డౌన్ అవడంపై కొంత మంది ట్విట్టర్ వేదికగా జియోలో తలెత్తిన సమస్యలను రిపోర్ట్ చేశారు.
తమ జియో నెంబర్లు పని చేయడం లేదని చెప్పారు. అంతే కాకుడా ఇతర నెట్‌వర్క్‌లతో జియో నంబర్లకు కాల్ చేసినా కాల్స్ కనెక్ట్ కావడం లేదని చెప్పుకొచ్చారు. జియో నెట్వర్క్ ఇలా చేయడంపై కొంత మంది యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Jio network down since the last 45 mins. Do something about it ASAP @reliancejio #Jiodown pic.twitter.com/44HzaamIZN
— Kartik Mehta (@kartikmehta86) February 5, 2022
మరికొంత మందేమో.. చాలా రోజుల నుంచి ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నామి.. ఇక ఎయిర్టెల్ లేదా ఇతర నెట్‌వర్క్‌లకు ఛేంజ్ కావాల్సిన సమయం వచ్చిందంటూ తమ జియో నెట్‌వర్క్‌పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
కొంత మంది యూజర్లు.. పనులన్నీ ఆగిపోయాయని వెంటనే సమస్యను పరిష్కరించాలని జియోకు ట్వీట్ చేస్తున్నారు.
Ohhh... The irony!@reliancejio #JioDown pic.twitter.com/XDBWUijx88
— Sujay 🌏 (@sujkad) February 5, 2022
జియోపై జోకులు..
ఇక జియో నెట్వర్క్ డౌన్‌పై చాలా మంది #Jiodown ట్వీట్లు చేస్తున్నారు. మరికొంత మంది జియోపై జోకులు వేస్తూ.. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలను పొగుడుతున్నారు.
#Jiodown Let’s shift to Airtel :) pic.twitter.com/5I8dWvEpW8
— Pranav Pawar (@PranavPawar832) February 5, 2022
అధికారికంగా వెల్లడించని జియో..
అయితే ముంబయిలో నెట్వర్క్ అంతరాయంపై జియో అధికారిక ప్రకటన చేయలేదు. దీనితో పాటు ఇంకా వేరే సర్కిళ్లలోనూ ఇలాంటి సమస్యలు ఏవైనా వచ్చాయా? అనే విషయంపైనా జియో స్పష్టతనివ్వాల్సి ఉంది.
Also read: iPhone SE 3: యాపిల్ నుంచి బడ్జెట్ 5జీ ఫోన్- ధర, ఫీచర్ల వివరాలివే..!
Also read: PF Accounts: రెండు భాగాలుగా పీఎఫ్ అకౌంట్స్.. ఈ ఏడాది ఏప్రిల్ నుంచే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook