Get iPhone 14 @ Just 34,000 Rupees Only: ఐఫోన్ అప్‌కమింగ్ సిరీస్ ఐఫోన్ 15 మరో నాలుగు నెలల్లో లాంచ్ కానుంది. సెప్టెంబర్ నెలలో లాంచ్‌కు రంగం సిద్ధమౌతోంది. సాధారణంగా ఐఫోన్ కొత్త సిరీస్ లాంచ్ తరువాత పాత మోడల్ ధర తగ్గుతుంటుంది. కానీ ఇప్పుడు ఐఫోన్ 15 లాంచ్ కంటే ముందే ఐపోన్ 14 ధర తగ్గిపోయింది. ఆ వివరాలు పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐఫోన్ కొత్త సిరీస్ ఐఫోన్ 15 లాంచ్ కావల్సి ఉంది. సెప్టెంబర్ నెలలో మెగా ఈవెంట్ ద్వారా లాంచ్ చేసే అవకాశాలున్నాయి. అయితే ఇప్పుడు లాంచ్ కంటే మందే 80 వేల ఖరీదైన ఐఫోన్ 14 ఇప్పుడు 35 వేలకే కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది. మరీ ఇంత తక్కువ ధరకు ఎలా లభిస్తుందని ఆశ్చర్యపోతున్నారా..ఆ వివరాలు మీ కోసం..


iPhone 14 Offers & Discounts:


ఐఫోన్ 14 లాంచింగ్ ధర 79,900 రూపాయలు కాగా ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు తక్కువ ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో 11 శాతం డిస్కౌంట్‌తో 70,999 రూపాయలు అందుబాటులో ఉంది. అంటే 8,901 రూపాయలు డిస్కౌంట్ లభిస్తోంది. ఇక ఆ తరువాత వివిధ బ్యాంకుల ఆఫర్లు, ఎక్స్చేంజ్ ఆఫర్‌లు ఎలానూ ఉన్నాయి. దీంతో ఈ ఫోన్ మరింత తక్కువకు వచ్చేస్తుంది. 


Also Read: Cheapest Bike: డెడ్‌ ఛీప్‌ ధరలతో అత్యధిక మైలేజీనిచ్చే బైక్‌ ఇదే..లీటర్‌కు మైలేజీ ఎంతిస్తుందో తెలుసా?


ఐఫోన్ 14 కొనుగోలు చేసేందుకు హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డు వినియోగిస్తే 4 వేల రూపాయలు డిస్కౌంట్ అందుతుంది. అంటే ఈ డిస్కౌంట్ అనంతరం ఐఫోన్ 14 ధర 66,999 రూపాయలైంది. ఇక దీనిపై ఎక్స్చేంజ్ ఆఫర్ వర్తిస్తుంది. ఐఫోన్ 14పై ఎక్స్చేంజ్ ఆఫర్ ఏకంగా 33 వేల రూపాయల వరకూ ఉంది. మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే ఈ ఆఫర్ వర్తిస్తుంది.


కానీ మీ పాత స్మార్ట్‌ఫోన్ మోడల్, కండీషన్‌ను బట్టి 33 వేల ఎక్స్చేంజ్‌లో ఎంత వర్తిస్తుందనేది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఎక్స్చేంజ్ ఆఫర్ 33 వేలు పూర్తిగా వర్తిస్తే ఐఫోన్ 14 ధర కేవలం 33, 999 రూపాయలే అవుతుంది. అంటే 80 వేల ఐఫోన్ 14 కాస్తా ఇప్పుడు కేవలం సగం కంటే తక్కువ ధర 33 వేలకే సొంతం చేసుకోవచ్చు.


Also Read: LPG Price: జూన్ 1 ఇవాళ్టి నుంచి భారగా తగ్గిన ఎల్పీజీ గ్యాస్ ధర, సిలెండర్ ఎంతంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook