LPG Gas Price Cut by Rs 83: రూ. 83 తగ్గిన LPG గ్యాస్ ధర.. ఈ రోజు నుండే అమలు

LPG Price Decreased Rs 83: దేశ ప్రజలకు గుడ్‌న్యూస్. జూన్ నెల ప్రారంభంతోనే ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధరలు తగ్గాయి. ఇవాళ్టి నుంచి గ్యాస్ సిలెండర్ ఎంత తగ్గింది, ఎంత చెల్లించాలనే వివరాలు తెలుసుకుందాం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 3, 2023, 06:25 PM IST
  • దేశ ప్రజలకు శుభవార్త, ఇవాళ్టి నంచి గ్యాస్ సిలెండర్ ధరల్లో భారీ తగ్గింపు
  • జూన్ 1 నుంచి 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలెండర్‌పై 83 రూపాయలు తగ్గింపు
  • డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధరలు యధాతధం
LPG Gas Price Cut by Rs 83: రూ. 83 తగ్గిన LPG గ్యాస్ ధర.. ఈ రోజు నుండే అమలు

LPG Gas Price Reduced Rs 83: ప్రతి నెలా 1వ తేదీన చమురు కంపెనీలు గ్యాస్ ధరల్ని సమీక్షించి నిర్ణయం తీసుకుంటుంటాయి. అందుకే ప్రతి నెల గ్యాస్ ధరల్లో మార్పులు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు మరోసారి వంట గ్యాస్ ధరలు తగ్గాయి. ఇవాళ్టి నుంచి ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధర ఎంతంటే..

జూన్ 1వ తేదీ అంటే ఇవాళ్టి నుంచి ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధరల్లో భారీ తగ్గుదల కన్పిస్తోంది. గ్యాస్ సిలెండర్ ధరల్ని తగ్గిస్తూ చమురు కంపెనీలు ప్రజలకు ఊరట కల్గించాయి. అయితే ఇవాళ్టి నుంచి తగ్గిన గ్యాస్ సిలెండర్ ధరలు కేవలం కమర్షియల్ గ్యాస్‌కే వర్తిస్తాయి. డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధరలు యధాతధంగా ఉన్నాయి.

ప్రతి నెలా సమీక్షించినట్టే ఈనెల 1వ తేదీ నుంచి ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధరల్ని తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఈ తగ్గింపును కేవలం కమర్షియల్ గ్యాస్ సిలెండర్లకే పరిమితం చేశాయి చమురు కంపెనీలు. డొమెస్టిక్ గ్యాస్ అంటే 14.2 కిలోల గ్యాస్ సిలెండర్ ధరలు యధాతధంగా ఉన్నాయి. డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధర 1133 రూపాయల వరకూ పలుకుతోంది.

Also Read: MCLR Rates: ఐసీఐసీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లు కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో మార్పులు

ఇక కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధర 1856.50 రూపాయలు కాగా ఇవాళ్టి నుంచి అంటే జూన్ 1 నుంచి ప్రతి సిలెండర్‌పై 83 రూపాయలు తగ్గుతోంది. అంటే ఇవాళ్టి నుంచి 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధర 1773 రూపాయలు ఉంటుంది. 

గత కొద్దికాలంగా కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధరలు ఎంతో కొంత తగ్గిస్తున్న చమురు కంపెనీలు డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధరల్లో మాత్రం ఏ మార్పు చేయలేదు. రెండు నెలల క్రితం పెంచిన ధరనే కొనసాగిస్తోంది. డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధరలు తగ్గించకపోవడంతో సామాన్య ప్రజానీకానికి నిరాశ నెలకొంది. ప్రతి నెలా 11 వందలకు పైగా గ్యాస్ సిలెండర్‌కు వెచ్చించడం భారంగా మారుతోంది. 

Also Read: Jimny, Citroen C3 Aircross: జూన్‌లో కొత్తగా లాంచ్ కాబోతున్న కార్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News