Bank holidays April 2022: మార్చి నెల దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఈ నెలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూడా ముగుస్తుంది. ఏప్రిల్ 1 నుంచి నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభంకానుంది. మరి 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి నెలలో బ్యాంకు సెలవులు ఎన్ని? ఏఏ రోజు సెలవులో ఉండనున్నాయి. అనే విషయాలను చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏప్రిల్​లో సెలవుల జాబితా..


ఏప్రిల్​లో బ్యాంకులు మొత్తం 15 రోజులు సెలవులో ఉండనున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే..  ఈ సెలవులన్నీ అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండవు. అన్ని బ్యాంకులకు కూడా ఈ సెలవులు వర్తించవు. ప్రాంతాన్ని బట్టి సెలవుల్లో మార్పులు ఉంటాయి.


రిజర్వు బ్యాంక్ ప్రకారం వివిధ ప్రాంతాల్లో స్థానిక పండుగలను, ప్రత్యేక రోజులను బట్టి ఈ సెలవులు ఉంటాయి.


ఏప్రిల్​ 1- 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అకౌంట్స్​ క్లోజింగ్​ డే. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు సెలవులో ఉంటాయి.


ఏప్రిల్​ 2- ఉగాది  (తెలుగు నూతన సంవత్సరం), గుడిపడ్వా. తెలంగాణ, అంధ్రప్రదేశ్​, కర్ణాటక, మహారాష్ట్ర సహా వివిధ ప్రాంతాల్లో బ్యాంకులు సెలవులో ఉంటాయి.


ఏప్రిల్​ 4- సర్హుల్ సందర్భంగా జార్ఖండ్​లో బ్యాంకులకు సెలవు.


ఏప్రిల్​ 5- బాబు జగ్జీవన్ రామ్​ జయంతి (దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు)


ఏప్రిల్​ 14- డాక్టర్​ బాబాసాహెబ్​ అంబేడ్కర్​ జయంతి, మహవీర్ జయంతి, వైశాఖి, తమిళ నూతన సంవత్సరం, బిజు ఫెస్టివల్​, బోగ్ బిహు. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు.


ఏప్రిల్​ 15- గుడ్​ ఫ్రైడే, బెంగాలి న్యూ ఇయర్​, హిమాచల్ డే, విషు, (దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు)


ఏప్రిల్​ 16- బోగ్ బిహు


ఏప్రిల్​ 21- గరియా పూజ


ఏప్రిల్​ 29- శాబ్-ఐ-ఖదర్​/ జుమాత్​-ఉల్​-విదా


సాధారణ సెలవులు..


  • ఏప్రిల్​ 3- ఆదివారం

  • ఏప్రిల్​ 9- రెండో శనివారం

  • ఏప్రిల్​ 10- ఆదివారం

  • ఏప్రిల్​ 17- ఆదివారం

  • ఏప్రిల్​ 23- నాలుగో శనివారం

  • ఏప్రిల్​ 24- ఆదివారం


నిజానికి బ్యాంకులు సెలవులో ఉన్నప్పటికీ.. ఆన్​లైన్​ లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండదు. అన్ని అన్​లైన్​ లావాదేవీలు 24x7 పని చేస్తాయి. ఏటీఎంలలో కూడా నగదు విత్​డ్రా చేసుకునే వీలుంటుంది. అయితే కేవలం బ్యాంకులో తప్పనిసరిగా పని ఉన్నవారికే మాత్రమే ఎఫెక్ట్ పడుతుంది. అందుకే ఎఫ్​డీ లేదా ఇంకేదైనా ఆఫ్​లైన్ పని ఉంటే.. ముందుగా ప్లాన్​ చేసుకోవడం బెటర్​.


Also read: Amazon Fab TV Fest: స్మార్ట్​ టీవీలపై అమెజాన్ క్రేజీ ఆఫర్లు.. రేపే లాస్ట్​ డేట్​!


Also read: Gold and Silver Prices Today: తగ్గిన పసిడి ధర.. హైదరాబాద్‌లో తాజా బంగారం, వెండి రేట్లు ఇవే!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook