Amazon Fab TV Fest: స్మార్ట్​ టీవీలపై అమెజాన్ క్రేజీ ఆఫర్లు.. రేపే లాస్ట్​ డేట్​!

Amazon Fab TV Fest: స్మార్ట్ టీవీలపై అమెజాన్ ఇండియా భారీ ఆఫర్లు ప్రకటించింది. ఫాబ్​ టీవీ ఫెస్ట్​లో భాగంగా.. ప్రీమియం నుంచి బడ్జెట్ బ్రాండ్లన్నింటపైనా స్పెషల్​ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఆఫర్ల పూర్తి వివరాలు మీకోసం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 24, 2022, 01:48 PM IST
  • స్మార్ట్ టీవీలపై అమెజాన్ క్రేజీ డీల్స్​
  • రేపటితో ముగియనున్న డిస్కౌంట్లు
  • అన్ని బ్రాండ్ల టీవీలపై ఆఫర్లు..
Amazon Fab TV Fest: స్మార్ట్​ టీవీలపై అమెజాన్ క్రేజీ ఆఫర్లు.. రేపే లాస్ట్​ డేట్​!

Amazon Fab TV Fest: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్​ టీవీలపై అదిరే ఆఫర్లు ఇస్తోంది. ఫాబ్​ టీవీ ఫెస్ట్​ పేరుతో నిర్వహిస్తున్న స్పెషల్​ సేల్​లో భాగంగా భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. ఈ నెల 20న ప్రారంభమైన ఈ ఆఫర్లు.. రేపటితో (25 మార్చి) ముగియనున్నాయి. మరి ఏ టీవీపై ఎంత తగ్గింపు ఉందో తెలుసుకుందామా?

అమెజాన్​ ఈ స్పెషల్​ సేల్​లో సోనీ, ఎల్​జీ, శాంసంగ్​ వంటి ప్రీమియం బ్రాండ్లు సహా ఎం, వీయూ, వన్​ ప్లస్ వంటి బడ్జెట్ బ్రాండ్లపైనా భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. 55 శాతం వరకు ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

అమెజాన్ ఆఫర్లు..

బడ్జెట్ బ్రాండ్​.. రెడ్​మీ 32 ఇంచుల స్మార్టర్ ఎల్​ఈడీ టీవీ ధరను రూ.24,999 నుంచి రూ.13,499కి తగ్గించింది అమెజాన్​. బ్యాంక్ ఆఫర్​తో కలిపి ఈ తగ్గింపును పొందొచ్చని వివరించింది.

శాంసంగ్​ 43 అంగుళాల క్రిస్టల్ 4కే యూహెచ్​డీ టీవీ ధరను రూ.33,749గా నిర్ణయించింది అమెజాన్. దీని అసలు ధర రూ.52,999గా ఉంది.

రెడ్​మీ 50 అంగుళాల 4కే యూహెచ్​డీ ఆండ్రాయిడ్​ టీవీ ధరను రూ.58,499కి తగ్గించింది అమెజాన్. ఈ స్మార్ట్​ టీవీ అసలు ధర రూ.44,999గా ఉంది.

ఇక ప్రీమియం స్మార్ట్ టీవీ 55 అంగుళాల 4కే అల్ట్రా హెచ్​డీ (యూహెచ్​డీ) గూగుల్ టీవీ ధరను రూ.71,990కి తగ్గించింది. ఈ స్మార్ట్​ టీవీ అశలు ధర రూ.1,09,999గా ఉంది.

ఎల్​జీ 50 అంగుళాల యూహెచ్​డీ స్మార్ట్​ టీవీ అసలు ధర రూ.64,900గా ఉంది. ఫాబ్​ టీవీ ఫెస్ట్​లో భాగంగా దీని ధరను రూ.41,499కి తగ్గించింది అమెజాన్​.

ఎల్​జీలో బడ్జెట్ రేంజ్​లో వచ్చిన 32 అంగుళాల హెచ్​డీ రెడీ స్మార్ట్​ టీవీ ధరను రూ.23,999 నుంచి రూ.16,499కు తగ్గించింది.

Also read: Gold and Silver Prices Today: తగ్గిన పసిడి ధర.. హైదరాబాద్‌లో తాజా బంగారం, వెండి రేట్లు ఇవే!!

Also read: UPI Lite APP: డిజిటల్ చెల్లింపు దారులకు గుడ్ న్యూస్‌.. ఇంటర్నెట్ లేకుండా UPI ట్రాన్సాక్షన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News