Amzon prime plans: ప్రపంచవ్యాప్తంగా ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది. నచ్చిన భాషలో నచ్చిన కంటెంట్ నచ్చిన సమయంలో చూసేందుకు వీలుండటంతో అందరూ ఓటీటీపై మక్కువ చూపిస్తున్నారు. కొత్త కొత్త సినిమాలు కూడా ధియేటర్లతో సమానంగా ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. అలాంటి ఓటీటీలు చాలానే ఉన్నా అమెజాన్ ప్రై‌మ్‌కు ఉన్న ఆదరణ కాస్త ఎక్కువే అని చెప్పాలి. అమెజాన్ అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెజాన్ ప్రైమ్‌లో 4 రకాల ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో నెలకు, మూడు నెలలకు ప్లాన్స్‌తో పాటు వార్షిక ప్లాన్స్ రెండున్నాయి. అమెజాన్ ప్రైమ్ మంత్లీ ప్లాన్ కేవల 299 రూపాయలు మాత్రమే. వ్యాలిడిటీ కూడా నెలరోజులుంటుంది. ఇక రెండవది త్రైమాసిక ప్లాన్. ఇది మూడు నెలలకు 599 రూపాయలు. మూడవది  అమెజాన్ ప్రైమ్ లైట్ ఏడాది సబ్‌స్క్రిప్షన్ 799 రూపాయలకు అందిస్తోంది. వార్షిక ప్లాన్‌లో రెండవది 1499 రూపాయలు. ఈ ప్లాన్ తీసుకుంటే పే ఆన్ డెలివరీ సౌకర్యం ఉంటుంది. మొదటిసారి సభ్యత్వం తీసుకుంటే 30 రోజుల ఫ్రీ ట్రయల్ ఉంటుంది. 


అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే వివిధ రకాల కంటెంట్ వీక్షించగలగడమే కాకుండా ఆన్‌లైన్ షాపింగ్ చేస్తే 5 శాతం డిస్కౌంట్ ఉంటుంది. ఉచితంగా పుస్తకాలు చదువుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ ఏదైనా ఆర్డర్ చేస్తే 24 గంటల్లోనే డెలివరీ ఉంటుంది. 


Also read: RBI on Repo Rate: ఆర్బీఐ గుడ్‌న్యూస్ రెపో రేటు యధాతధం, అవే వడ్డీ రేట్లు



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook