Safety SUV in India: కారు కొనుగోలు చేసే ముందు ప్రతి కస్టమర్ వివిధ రకాలుగా ఆలోచిస్తుంటాడు. ఎక్కువమంది బడ్జెట్ గురించి ఆలోచించినా..రెండవ ప్రధానాంశం సేఫ్టీ గురించి. సేఫ్టీ రేటింగ్ ఎలా ఉందనేది కీలకంగా పరిశీలిస్తాడు. అప్పుడే ఏ కారు కొనుగోలు చేయాలో నిర్ణయించుకుంటాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలి కాలంలో ప్రజలకు సేఫ్టీ అంశాలపై ఆసక్తి పెరుగుతోంది. కారు కొనుగోలు చేసే ముందు కారులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయనేది చూస్తూనే సేఫ్టీ రేటింగ్ ఎలా ఉందనేది ప్రధానంగా పరిశీలిస్తుంటారు. స్ట్రాంగ్‌నెస్ కారణంగా ఎక్కువమంది ఎస్‌యూవీ కొనడం ఇష్టపడుతుంటారు. దేశంలో ఎక్కడ చూసినా 4 మీటర్ ఎస్‌యూవీ విభాగంలోనే విక్రయాలు జరుగుతున్నాయి. ఈ విభాగంలో చాలా కార్లు అందుబాటులో ఉన్నా..ఎక్కువగా ప్రాచుర్యం పొందింది మాత్రం మారుతి బ్రిజా, టాటా నెక్సాన్ మాత్రమే.


టాప్ సెల్లింగ్ కార్లలో మారుతి సుజుకి కంపెనీ కార్లు టాప్‌లో ఉన్నా..ఎస్‌యూవీ విషయంలో మాత్రం టాటా నెక్సాన్ అగ్రస్థానంలో ఉంది. ఎందుకంటే సేఫ్టీ రేటింగ్ విషయంలో టాటా నెక్సాన్..మారుతి బ్రెజా కంటే ముందంజలో ఉందని చెప్పవచ్చు. టాటా నెక్సాన్ గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ దక్కించుకుంది. అటు 2022లో మారుతి బ్రిజా కొత్త వెర్షన్ క్రాష్ టెస్ట్ ఇంకా జరగలేదు. పాత వెర్షన్‌కు 4 స్టార్ రేటింగ్ లభించింది. అటు ధర విషయంలో కూడా టాటా నెక్సాన్ ధర మారుతి సుజుకి బ్రిజా కంటే తక్కువ.


టాటా నెక్సాన్ అనేది ఒక 5 సీటర్ ఎస్‌యూవీ కారు. ఈ కారు ధర ఎక్స్ షోరూంలో 7.89 లక్షల రూపాయల్నించి 14.35 లక్షల వరకూ ఉంది. బ్రెజా కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉంది. మారుతి బ్రిజా ధర 8.29 లక్షల రూపాయల్నించి ప్రారంభమౌతుంది. నెక్సాన్ కారు పెట్రోల్, డీజిల్ రెండింట్లోనూ అందుబాటులో ఉంది. 1.2 లీటర్, 3 సిలెండర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు 120పీఎస్, 170 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. అటు 1.5 లీటర్, 4 సిలెండర్ టర్బోఛార్జ్డ్ డీజిల్ ఇంజన్ 115 పీఎస్, 260 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది మేన్యువల్, ఏఎంటీ గేర్ బాక్స్ రెండింట్లోనూ లభ్యమౌతుంది. 


Also read: Maruti Electric SUV: మారుతి తొలి ఎలక్ట్రిక్ కారు లాంచ్ ఎప్పుడు , ఆ కారు ప్రత్యేకతలేంటి


టాటా నెక్సాన్ ఎస్‌యూవీలో ఆండ్రాయిండ్ ఆటో, యాపిల్ కార్ ప్లే కనెక్టివిటీ, 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్, సన్‌రూఫ్, ఆటో ఏసీ, రేర్ ఏసీ వెంట్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, క్రూయిజ్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్, పార్కింగ్ సెన్సార్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఇక బూట్ స్పేస్ కూడా 350 లీటర్లు ఉంటుంది. 


Also read: Automatic Cars: దేశంలో అత్యంత చౌకగా లభించే టాప్ 5 ఆటోమేటిక్ కార్లు ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook