Best SUV Cars: ఇటీవలి కాలంలో చాలామంది ఎస్‌యూవీ కార్లపై ఆసక్తి చూపిస్తున్నారు. వీటిలో కూడా 4 మీటర్ ఎస్‌యూవీలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఏ కంపెనీ ఎస్‌యూవీ తీసుకోవాలో నిర్ణయించుకోలేక ఇబ్బంది పడుతున్నారా...ఇక్కడ మీ కోసం 10 లక్షలకు దిగువన లభిస్తున్న 10 ఎస్‌యూవీల వివరాలు అందిస్తున్నాం..ఏది మీకు అనువైందో మీరే నిర్ణయించుకోవచ్చు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాలో ప్రస్తుతం 4 మీటర్ ఎస్‌యూవీ క్రేజ్ కొనసాగుతోంది. ఇందులో మారుతి సుజుకి నుంచి టాటా మోటార్స్, హ్యుండయ్ వరకూ అన్నీ ఉన్నాయి. ఈ మూడు కంపెనీల ఎస్‌యూవీలు ఒకదానికొకటి గట్టి పోటీ ఇస్తున్నాయి. ఎస్‌యూవీ కోసం మీ బడ్జెట్ 10 లక్షల రూపాయలైతే, అదే పది లక్షల్లోపు ధరకు లభించే 10 ఎస్‌యూవీ కార్ల వివరాలు ఇలా ఉన్నాయి.


1. మహీంద్రా ఎక్స్‌యూవీ 300 ధర 8.42 లక్షల నుంచి 14.60 లక్షల వరకూ ఉంది.
2. మహీంద్రా బొలేరో ధర 9.78 లక్షల నుంచి 10.79 లక్షల వరకూ ఉంది.
3. కియా సోనెట్ ధర 7.79 లక్షల నుంచి 14.89 లక్షల వరకూ ఉంది.
4. హ్యుండయ్ వెన్యూ ధర 7.72 లక్షల నుంచి 13.18 లక్షలుంది.
5. మారుతి బ్రెజా ధర 8.29 లక్షల నుంచి 14.14 లక్షల రూపాయలుంది.
6. టాటా నెక్సాన్ ధర 7.80 లక్షల ుంచి 14.50 లక్షల వరకూ ఉంది.
7. మారుతి ఫ్రాంక్స్ ధర 7.46 లక్షల నుంచి 13.13 లక్షల రూపాయలుగా ఉంది.
8. రీనాల్ట్ కైగర్ ధర 6.50 లక్షల ుంచి 11.23 లక్షల వరకూ ఉంది.
9. నిస్సాన్ మ్యాగ్నైట్ ధర 6 లక్షల నుంచి 11.02 లక్షలుంది.
10. టాటా పంచ్ ధర 6 లక్షల నుంచి 9.52 లక్షలుంది.


ఈ జాబితాలో ఉన్న ఎస్‌‌యూవీల్లో అన్నింటికంటే ఎక్కువగా టాటా నెక్సాన్ విక్రయాలు జరుగుతున్నాయి. హ్యుండయ్ క్రెటా తరువాత మే నెలలో అత్యధిక విక్రయాలు నమోదు చేసిన రెండవ కారుగా నిలిచింది. మే 2023లో టాటా నెక్సాన్ 14,423 యూనిట్ల విక్రయాలు సాధించింది. ఇక రెండవ స్థానంలో మారుతి బ్రెజా, మూడవ స్థానంలో 
టాటా పంచ్ ఉన్నాయి. మారుతి బ్రెజా మే నెలలో 13,398 యూనిట్ల విక్రయాలు నమోదు చేయగా, టాటా పంచ్ 11,100 యూనిట్లు అమ్మకాలు జరిపింది.


ఈ జాబితాలో ఒక్కొక్క కారుది ఒక్కొక్క మైలేజ్. బడ్జెట్ మీకు అనుకూలంగా ఉంటే ఇక ఫీచర్లు పోల్చుకుని తీసుకోవచ్చు. మైలేజ్, మెయింటెనెన్స్ పరంగా చూడాలంటే మారుతి సుజుకి కంపెనీ కార్లకు పోటీ మరేదీ లేదు. తరువాత స్థానం టాటా కంపెనీ కార్లదే. 


Also read: EPFO Latest Updates: ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు ముఖ్య గమనిక.. ఈ నెల 26 వరకే గడువు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook